Page Loader
Boeing jet : ఇంజన్ కవర్ విడిపోవడంతో అత్యవసర ల్యాండింగ్ అయిన బోయింగ్ జెట్ విమానం
ఇంజన్ కవర్ విడిపోవడంతో అత్యవసర ల్యాండింగ్ అయిన బోయింగ్ జెట్ విమానం

Boeing jet : ఇంజన్ కవర్ విడిపోవడంతో అత్యవసర ల్యాండింగ్ అయిన బోయింగ్ జెట్ విమానం

వ్రాసిన వారు Stalin
Apr 08, 2024
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో బోయింగ్ జెట్ విమానానికి చెందిన ఇంజన్ కవర్ విడిపోవడంతో విమానాన్నిఅత్యవసర ల్యాండింగ్ చేశారు. బోయింగ్ 737‌‌‌‌-800 విమానం 130 మంది ప్రయాణికులతో యూఎస్​లోని డెనివర్ విమానాశ్రయం నుంచి హూస్టన్ కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజన్ కవర్ విడిపోయి విమానం రెక్కను ఢీకొట్టడంతో కొంతమంది ప్రయాణికులు గట్టిగా అరిచారని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్​ లోని పైలట్ మీడియాకు తెలిపారు. దీనిపై వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సౌత్ వెస్ట్ 3695 విమానాన్ని అత్యవసరంగా దించుతున్నట్లు ఆడియోలో వినిపించిందని సదరు పైలట్ చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్​ఏఏల్​ విచారణకు ఆదేశించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అత్యవసర ల్యాండింగ్ అయిన బోయింగ్ జెట్ విమానం