Australia: 91మంది బాలికలపై లైంగిక వేధింపులు; మాజీ చైల్డ్ కేర్ వర్కర్ కేసు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో చైల్డ్ కేర్ వర్కర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి 91మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ దేశ పోలీసులు అభియోగాలు మోపారు.
అంతేకాకుండా అతనిపై 1,600కు పైగా నేరారోపణలు ఉన్నట్లు వెల్లడించారు.
దీన్ని ఆస్ట్రేలియా దేశంలోనే అత్యంత భయంకరమైన పిల్లల లైంగిక వేధింపుల కేసుల్లో ఒకటిగా ఆ దేశ పోలీసులు అభివర్ణించారు.
ఆరోపించిన నేరాలన్నీ 2007 -2022 మధ్య సిడ్నీ, బ్రిస్బేన్, విదేశాల్లో కలిపి 12 వేర్వేరు పిల్లల సంరక్షణ కేంద్రాలలో జరిగినట్లు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ (ఏఎఫ్‌పీ) తెలిపింది.
నిందితుడు 15ఏళ్లు పైబడిన బాలికలను లక్ష్యంగా చేసుకుని, లైంగిక దాడులు చేసినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది.
అతనిపై 246 అత్యాచార కేసులు, 673 పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి.
ఆస్ట్రేలియా
ఆగస్టు 21న బ్రిస్బేన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
లైంగిక దాడికి గురైన మొత్తం బాలికల్లో 87 మంది ఆస్ట్రేలియన్ మైనర్లను గుర్తించామని, విదేశాల్లో వేధింపులకు గురైన నలుగురు పిల్లలను గుర్తించేందుకు అధికారులు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.
2014లో డార్క్ వెబ్‌లో చలామణి అయిన పిల్లల పోర్న్ వీడియోలు గుర్తించినప్పటి నుంచి ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
2022లో క్వీన్స్‌ల్యాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌కు చెందిన నిందితుడు ఈ లైంగిక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం అరెస్టు చేశారు. పేరు వెల్లడించని ఆ వ్యక్తిని ఆగస్టు 21న బ్రిస్బేన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
నిందితుడి దగ్గర దాదాపు 4,000 ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. అతను లైంగిక వేధింపుల సమయంలో వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది.