
ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా సిడ్నీలోని పర్రమట్టా కౌన్సిల్ లార్డ్ మేయర్‌గా భారత సంతతికి చెందిన సమీర్ పాండే కొత్త లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.
పర్రమట్టా కౌన్సిల్‌కు భారత సంతతికి చెందిన మేయర్ తొలిసారిగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వచ్చిన రోజే భారత సంతతికి చెందిన సమీర్ పాండే మేయర్‌గా ఎన్నిక కావడం గమనార్హం.
సమీర్ పాండే మొదటిసారిగా 2017లో కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు. 2022లో భారత ఉపఖండం నుంచి నగరానికి మొదటి డిప్యూటీ లార్డ్ మేయర్ అయ్యారు.
సిడ్నీ
ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లో పర్రమట్టా ఒకటి
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పర్రమట్టా రాష్ట్ర సభ్యురాలుగా ఎన్నికైన డోనా డేవిస్ తన పదవి నుంచి తప్పుకోడవంతో సమీర్ పాండేకు అవకాశం దక్కింది.
ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లో ఒకటైన పర్రమట్టా కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం చాలా గొప్పగా ఉందని సమీర్ పాండే పేర్కొన్నారు.
పర్రమట్టా నగరం గ్రేటర్ సిడ్నీకి గుండెలాంటిదని, సిడ్నీలోనే అత్యుత్తమ ప్రదేశమని చెప్పారు.