Baby on board: ల్యాండింగ్‌కు క్షణాల ముందు కాన్పు.. పారామెడికల్ సిబ్బంది సహాయంతో పాప జననం
ఈ వార్తాకథనం ఏంటి
అట్లాంటా నుంచి బయలుదేరిన బోయింగ్ 737 విమానం అరగంటలో పోర్ట్‌లాండ్‌లో దిగుతుందనగా ప్రయాణం మధ్యలో పుట్టిన చిన్నారితో మురిసిపోతున్న తల్లి ఆష్లే బ్లెయిర్ చిత్రమిది. ఓరెగన్‌లో నివసిస్తున్న తన తల్లి వద్ద ప్రసవం కోసం వెళ్తున్న ఆష్లే బ్లెయిర్‌కు ప్రయాణం మధ్యలోనే నొప్పులు మొదలయ్యాయి. దీంతో విమానంలోనే కాన్పు జరిగింది. సుమారు 2.5కిలోల బరువుతో పాప జన్మించింది.
వివరాలు
దుప్పట్లు అడ్డుపెట్టి.. షూలేస్‌తో బొడ్డుతాడు కట్టి..
ఈ నెల 24వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు పారామెడికల్ సిబ్బంది వెంటనే స్పందించి ఆ మహిళకు సహాయం అందించారు. ఇతర ప్రయాణికులు దుప్పట్లు ఇచ్చి సహకరించగా,షూ లేస్‌ను ఉపయోగించి బొడ్డుతాడును కట్టారు. విమానంలో మొత్తం 153 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ సహకరిస్తూ కొంత స్థలం ఖాళీ చేసి ప్రసవానికి అనుకూల వాతావరణం కల్పించారు. పాప పుట్టడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాప జననంతో సంతోషిస్తున్న తల్లి
Mid-air miracle as woman delivers baby on Delta flight to Portland with the help of quick-thinking passengers https://t.co/oRTk2KQN38
— Daily Mail (@DailyMail) April 27, 2026