Republic of Balochistan: బలూచిస్థాన్‌కు భారత్ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్!
ఈ వార్తాకథనం ఏంటి
బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 11న నిర్వహించిన 'బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం' సందర్భంగా ఆయన 'ఎక్స్' వేదికగా ఈ డిమాండ్‌ను వెల్లడించారు. బలూచిస్థాన్‌ను ఇకపై పాకిస్థాన్‌లోని ఓ ప్రావిన్స్‌గా కాకుండా ప్రత్యేక స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సంస్థలను కోరారు. తమ స్వాతంత్య్ర ఉద్యమం ఇప్పుడు మరో కీలక దశలోకి అడుగుపెట్టిందని మిర్ యార్ బలూచ్ తెలిపారు. దౌత్యపరమైన, రాజకీయ గుర్తింపు సాధించడమే తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి, ఆసియాన్, ఆఫ్రికన్ యూనియన్, ఇస్లామిక్ సహకార సంస్థతో పాటు ఐరోపా దేశాలు కూడా బలూచిస్థాన్ స్వేచ్ఛకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
పాక్‌ను క్యాన్సర్‌తో పోల్చిన బలూచ్ నేత
బలూచిస్థాన్ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావడంలో భారత మీడియా, పరిశోధకులు కీలక పాత్ర పోషించారని బలూచ్ నేత పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత్‌కు చెందిన మీడియా సంస్థలు, పరిశోధకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మిర్ యార్ బలూచ్.. ఆ దేశాన్ని 'క్యాన్సర్'తో పోల్చారు.
పాకిస్థాన్ నుంచి తమ భూభాగాన్ని విముక్తి చేసుకునే పోరాటానికి అంతర్జాతీయ నైతిక మద్దతు అవసరమని స్పష్టం చేశారు.
తమ స్వాతంత్య్ర డిమాండ్‌కు చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, దౌత్యపరమైన గుర్తింపు సాధించడమే లక్ష్యం
1947 ఆగస్టు 11న.. బ్రిటీష్ ఇండియా విభజనకు కొన్ని రోజుల ముందే బలూచిస్థాన్ స్వాతంత్య్రాన్ని ప్రకటించిందని మిర్ యార్ బలూచ్ గుర్తు చేశారు.
ఆ చారిత్రక పరిణామాన్ని ఆధారంగా చేసుకునే తాము ప్రత్యేక స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నామని తెలిపారు.
భవిష్యత్తులో బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడితే సొంత కరెన్సీ, పాస్‌పోర్టులు, దౌత్య కార్యాలయాలు, రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
తమ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, దౌత్యపరమైన గుర్తింపు సాధించడమే లక్ష్యమని మరోసారి వెల్లడించారు.
వివరాలు
పాకిస్థాన్ చర్యలతో ఈ అంశం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశం
ఇదిలా ఉండగా.. బలూచిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలను అడ్డుకునేందుకు పాకిస్థాన్ అధికారులు చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.
దీంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న బలూచిస్థాన్‌లో పరిస్థితులు మరింత సున్నితంగా మారుతున్నాయి.
బలూచ్ నేత తాజా ప్రకటనలు, పాకిస్థాన్ చర్యలతో ఈ అంశం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.