Pakistan : పాక్‌లో న్యూఇయర్ వేడుకలు నిషేదం.. కారణమిదే?
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనాలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. దీంతో పాలస్తీనా ప్రజలకు మరోసారి అండగా పాకిస్తాన్ నిలిచింది. ఈ క్రమంలోనే గాజా ప్రజలకు సంఘీభావంగా పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సారి నూతన సంవత్సర వేడుకులను నిషేధించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పాక్ ఆపద్దర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ ప్రకటించారు. పాలస్తీనాలో తీవ్రమైన యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి సమయంలో పాలస్తీనా సోదరులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలు జరపకుండా నిషేధం విధిస్తున్నామని అన్వరుల్ హక్ కాకర్ పేర్కొన్నాడు.
పాలస్తీనా ప్రజలకు అండగా ఉంటాం
యుద్ధంతో ఇబ్బంది పడుతున్న పాలస్తీనా ప్రజలకు ఇపపటికే రెండుసార్లు మానవతా సాయం అందించామని, త్వరలోనే మరో విడత పంపిస్తామని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరీప్ అల్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రెండు దేశాల విధానం ఇజ్రాయెల్‌కు సమ్మతం కాకపోతే ఏక దేశ విధానమే పరిష్కారమన్నారు. ఇక అక్కడే యూదులు, ముస్లిములు, క్రైస్తవులు సమాన హక్కులు పంచుకుంటూ సామరస్యంగా జీవించాలని ఆల్వీ మాట్లాడినట్లు గతంలో అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్వదేశంలో తీవ్ర విమర్శలు రావడం గమనార్హం.