LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది సజీవదహనం
బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది సజీవదహనం

Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది సజీవదహనం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా నగరంలోని ఒక వస్త్ర ఉత్పత్తి సంస్థలో మంటలు విపరీతంగా వ్యాపించాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. స్థానికులు ఈ ఘటనను గమనించి అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను నియంత్రణలోకి తెచ్చారు. మంటలు మొదట్లో సమీపంలోని ఒక రసాయన పరిశ్రమలో ప్రారంభమై, తరువాత వస్త్ర పరిశ్రమలోకి వ్యాపించడంతో ఈ విషాదకర ఘటన జరిగింది. అధికారులు కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతానికి, అగ్ని ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగ్లాదేశ్ దుస్తుల కర్మాగారంలో అగ్ని ప్రమాదం, 16 మంది మృతి