Muhammad Yunus: ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు: మహమ్మద్ యూనస్
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనల్లో ప్రధాన నాయకుడిగా కొనసాగిన ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి చెందడంతో దేశంలో అశాంతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ రాబోయే ఎన్నికల గురించి కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు సకాలంలోనే జరుగుతాయని, భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్‌కు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. సెర్గియోతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు యూనస్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛ,న్యాయం, శాంతియుతంగా నిర్వహించాలనే ప్రభుత్వం నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
వివరాలు
స్వేచ్ఛ, న్యాయం,శాంతియుతంగా ఎన్నికలు
మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనను ప్రస్తావిస్తూ,"నిరంకుశ పాలన కాలంలో దొంగలించిన తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు"అని యూనస్ వ్యాఖ్యానించారు. అలాగే,ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి హసీనా మద్దతుదారులు మిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నారని,దేశం విడిచి వెళ్లిన వారు హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్నిసవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎన్నికలకు దాదాపు 50రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి;ఇవి స్వేచ్ఛ, న్యాయం,శాంతియుతంగా జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. అదనంగా,షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్న ఘటనలు,బంగ్లాదేశ్-అమెరికా వాణిజ్య ఒప్పందాలు,సుంకాలు,రాబోయే సార్వత్రిక ఎన్నికల అంశాలపై కూడా సెర్గియోతో చర్చించినట్లు యూనస్ వెల్లడించారు. ఇటీవల అమెరికా సుంకాలపై జరిగిన చర్చల్లో ఆయన నాయకత్వాన్ని అమెరికా రాయబారి అభినందించారు.