Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలి.. ప్రాసిక్యూటర్ల డిమాండ్..!
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్-1 (ICT-1)లో డిమాండ్ చేసింది. గత ఏడాది జూలై-ఆగస్టు సమయంలో జరిగిన ప్రభుత్వవ్యతిరేక నిరసనల్లో సుమారు 1,400 మంది మరణించారని తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ మరణాలను హత్యలుగా అభివర్ణించింది తాత్కాలిక ప్రభుత్వం. ఈ హత్యలకు గాను హసీనాకు "1,400 మరణశిక్షలు" విధించాలని తాత్కాలిక ప్రభుత్వ న్యాయవాది ICT-1లో వాదించారు ఢాకా ట్రిబ్యూన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం తన వాదనను వినిపించారు.
వివరాలు
హసీనాను 1,400 సార్లు ఉరితీయాలి
విద్యార్థి ఉద్యమ సమయంలో జరిగిన హింసకాండల వెనుక షేక్ హసీనా ప్రధాన సూత్రధారి ఆయన ఆరోపించారు షేక్ హసీనా నిరసన కారులపై కాల్పులు జరపాలని స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతీ హత్యకు వేర్వేరు శిక్షలు విధిస్తే అవి మొత్తం 1,400 శిక్షలు అవుతాయని, అది నిర్వహించడం సాధ్యం కాదు కనుక కనీసం ఆమెకు ఒకే మరణశిక్ష విధించాల్సిన అవసరం ఉందని చీఫ్ ప్రాసిక్యూటర్ వాదించారు. లేకపోతే బాధితులకు అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.
వివరాలు
ముందస్తు ప్రణాళికతో నేరాలకు పాల్పడ్డారు
తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి మాజీ హోం మంత్రిగా ఉన్న అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీసు జనరల్ డైరెక్టర్ (IGP) చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌లపై కూడా మరణశిక్షలు విధించాలని చీఫ్ ప్రాసిక్యూటర్ కోరా. ఈ ముగ్గురి పైనే ముందస్తు ప్రణాళికతో నేరాలు చేశారని ఆయన ఆరోపించారు.