Page Loader
China Blast: బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు
బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు

China Blast: బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు

వ్రాసిన వారు Stalin
Mar 13, 2024
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని ఓ భవనంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 22మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బీజింగ్‌కు 50కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న సాన్హే నగరంలోని జియోజాంగ్జెజువాంగ్ గ్రామ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. చైనీస్ మీడియా ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్‌లో పేలుడు సంభవించింది. గ్యాస్ లీక్ కావడమే పేలుడుకు కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. పేలుడు అనంతరం పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనకు సంబంధిచిన వీడియో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పేలుడుకు సంబంధించిన దృశ్యాలు