LOADING...
Big update for H-1B visa holders: హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ వేగవంతం
గ్రీన్‌కార్డ్ ప్రక్రియ వేగవంతం

Big update for H-1B visa holders: హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ వేగవంతం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న విదేశీ నిపుణులకు టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ శుభవార్తను అందించింది. వచ్చే ఏడాది నుంచి తమ సంస్థలో పనిచేస్తున్న హెచ్‌-1బీ (H-1B) వీసా కలిగిన ఉద్యోగులకు సంబంధించిన గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టనున్నట్లు గూగుల్‌ వెల్లడించినట్టు సమాచారం. ఈ నిర్ణయంపై ఉద్యోగులకు ఇంటర్నల్‌ న్యూస్‌లెటర్‌ ద్వారా వివరాలు తెలియజేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. అర్హత ఉన్న ఉద్యోగుల విషయంలో 2026 సంవత్సరంలో PERM దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వివరాలు 

అధికారిక బహిరంగ ప్రకటన చేయని గూగుల్ 

PERM అర్హత పొందిన ఉద్యోగులకు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గూగుల్‌ నియమించిన ఇమిగ్రేషన్‌ లా ఫర్మ్‌ల నుంచి సంప్రదింపు వచ్చే అవకాశం ఉందని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్రణాళికపై గూగుల్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక బహిరంగ ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ట్రంప్‌ కాలంలోని కఠిన వలస విధానాలు,పెరుగుతున్న వీసా ఫీజులు,సోషల్‌ మీడియా వెట్టింగ్‌ నిబంధనల నేపథ్యంలో గూగుల్‌ తీసుకున్న ఈ నిర్ణయం అనేక మంది హెచ్‌-1బీ ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారనుంది.

వివరాలు 

PERM ప్రక్రియ అంటే ఏమిటి? 

అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల మంజూరులో 'ప్రోగ్రామ్‌ ఎలక్ట్రానిక్‌ రివ్యూ మేనేజ్‌మెంట్‌ (PERM)'ప్రక్రియకు కీలక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా టెక్నాలజీ సంస్థలు ఈ విధానాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటాయి. తమ వద్ద పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా లభించేలా కంపెనీలు ఈ ప్రక్రియ ద్వారా సహాయం చేస్తాయి. PERM అనుమతి లభించిన తర్వాతే సంబంధిత ఉద్యోగి తన గ్రీన్‌కార్డ్ దరఖాస్తు తదుపరి దశలకు వెళ్లగలుగుతాడు. అయితే,ఈ ప్రక్రియకు అనేక కఠినమైన నిబంధనలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల అమెరికన్‌ వర్కర్లకు ఎలాంటి నష్టం కలగదని కంపెనీలు స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా,ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికా పౌరులు లేదా నివాసితులు అందుబాటులో లేరని కూడా రుజువు చేయాల్సి ఉంటుంది.

Advertisement

వివరాలు 

PERM ప్రక్రియ అంటే ఏమిటి? 

ఈ కారణాల వల్లే లేఆఫ్‌లు లేదా నియామకాల్లో మందగమనం ఉన్న సమయంలో చాలా కంపెనీలు PERM దరఖాస్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంటాయి. లేఆఫ్‌లు అధికంగా జరుగుతున్న సమయంలో విదేశీ ఉద్యోగులకు PERM నిబంధనల ప్రకారం స్పాన్సర్‌షిప్‌ ఇవ్వడాన్ని సమర్థించుకోవడం సంస్థలకు కష్టంగా మారుతుంది. 2023 జనవరిలో గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా 12వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో PERM దరఖాస్తుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అదే ఏడాది అమెజాన్‌,మెటా వంటి ఇతర టెక్‌ దిగ్గజాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. గత ఏడాదిలో గూగుల్‌ చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే PERM దరఖాస్తులను దాఖలు చేసింది. అయితే, 2026 నుంచి ఈ ప్రోగ్రామ్‌ను వేగవంతం చేయాలనే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది.

Advertisement

వివరాలు 

అర్హత ప్రమాణాలు ఎలా ఉంటాయి? 

గూగుల్‌లో పనిచేస్తున్న ప్రతి విదేశీ ఉద్యోగి PERM ప్రక్రియకు అర్హుడు కాడు. దీనికి సంబంధించి సంస్థ కొన్ని నిర్దిష్ట అర్హత నిబంధనలను అమలు చేస్తోంది. విద్యార్హతలతో పాటు ఉద్యోగ అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, గూగుల్‌ కార్యాలయాలకు హాజరై పనిచేసే ఉద్యోగులకే ఈ ప్రోగ్రామ్‌ వర్తిస్తుంది. రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులు PERM అర్హత పొందాలంటే తప్పనిసరిగా తమ నివాస ప్రదేశాన్ని కార్యాలయానికి సమీపంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగి సీనియార్టీ, పనితీరు కూడా అర్హత నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయని గూగుల్‌ అంతర్గత మెమోలో పేర్కొన్నట్లు సమాచారం.

Advertisement