LOADING...
Bill Gates: ముగ్గురు రష్యన్ మహిళలతో అఫైర్స్.. విచారణలో బిల్‌గేట్స్ షాకింగ్ నిజాలు
ముగ్గురు రష్యన్ మహిళలతో అఫైర్స్.. విచారణలో బిల్‌గేట్స్ షాకింగ్ నిజాలు

Bill Gates: ముగ్గురు రష్యన్ మహిళలతో అఫైర్స్.. విచారణలో బిల్‌గేట్స్ షాకింగ్ నిజాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ ఇటీవల అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ నిర్వహించిన రహస్య విచారణలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. మంగళవారం విడుదలైన విచారణ ట్రాన్స్‌క్రిప్ట్‌లో గేట్స్ తాను ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నానని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అలాగే దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితులతో తాను ఏదో సందర్భంలో కలిసి ఉండి ఉండవచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఎప్స్టీన్‌తో తనకు సుమారు మూడు సంవత్సరాల పాటు పరిచయం ఉన్నప్పటికీ అది పూర్తిగా వృత్తిపరమైనదేనని గేట్స్ తెలిపారు. ఇదే సమయంలో ఆయనకు సంబంధం ఉన్న మహిళల పేర్లు కూడా తొలిసారిగా బహిర్గతమయ్యాయి.

వివరాలు 

2010కు ముందే జాకబ్స్‌తో సంబంధం..

వాటిలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో డాక్టరేట్ పొందిన వైద్య వ్యాపారవేత్త ఆలిస్ జాకబ్స్ నెసెల్‌రోడ్ట్, రష్యన్ అణు శాస్త్రవేత్త కరీమా నిగ్మతులీనా ఉన్నారు. మొత్తంగా తనకు మూడు వివాహేతర సంబంధాలు ఉన్నాయని గేట్స్ పేర్కొన్నారు. నిగ్మతులినా, అలాగే రష్యన్ బ్రిడ్జ్ క్రీడాకారిణి మిలా ఆంటోనోవాతో ఉన్న సంబంధాల గురించి 2013కు ముందే తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్'కు చెప్పినట్లు గేట్స్ తెలిపారు. జాకబ్స్‌తో ఉన్న సంబంధాన్ని కూడా ఆమెకు వెల్లడించానని, అయితే అది ఎప్పుడు జరిగిందో ప్రస్తుతం గుర్తులేదని చెప్పారు. జాకబ్స్‌తో సంబంధం 2010కు ముందే జరిగినట్లు వెల్లడించారు. ఈ విషయాలు మెలిండాకు తీవ్ర మానసిక వేదన కలిగించినప్పటికీ, అప్పట్లో విడాకుల గురించి చర్చించలేదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

రష్యన్ అణు శాస్త్రవేత్త కరీమా నిగ్మతులినాతో పరిచయం

రష్యన్ అణు శాస్త్రవేత్త కరీమా నిగ్మతులినాతో తన పరిచయం వ్యాధుల నమూనా అధ్యయనం (డిసీజ్ మోడలింగ్),అణు విభజన పరిశోధనల సందర్భంగా ఏర్పడిందని గేట్స్ తెలిపారు. ఆ సమయంలో ఆమె గేట్స్ పెట్టుబడులు పెట్టిన టెర్రాపవర్ సంస్థలో పనిచేస్తున్నారని చెప్పారు. లండన్‌లో నిగ్మతులినాతో శారీరక సంబంధం ఏర్పడిందని, ఈ విషయం ఎప్స్టీన్ ఫైల్స్‌లో కూడా ప్రస్తావించినట్లు వెల్లడించారు. విచారణ సందర్భంగా కమిటీ సభ్యులు జాకబ్స్ 2009 అక్టోబర్‌లో ఎప్స్టీన్‌తో పరిచయం ఏర్పరుచుకున్న విషయాన్ని గేట్స్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె గేట్స్‌కు అత్యంత సన్నిహిత ఉద్యోగిగా ఉన్న బోరిస్ నికోలిక్'ను ఎప్స్టీన్‌కు పరిచయం చేసినట్లు తెలిపారు. నికోలిక్ తర్వాత గేట్స్‌కు అత్యంత సన్నిహితుడిగా మారి, ఎప్స్టీన్-గేట్స్ మధ్య ప్రధాన అనుసంధాన వ్యక్తిగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే వ్యాధి సోకిందా?

జాకబ్స్ తన ఇమెయిల్‌లో నికోలిక్‌ను "నా అత్యంత సన్నిహిత మిత్రుడు"గా పేర్కొన్న విషయంపై ప్రశ్నించగా, ఆమెకు ఎప్స్టీన్‌తో పరిచయం ఉందన్న విషయం తనకు తెలియదని గేట్స్ సమాధానమిచ్చారు. తాను ఆ ముగ్గురు మహిళల గురించి ఎప్స్టీన్‌తో ఎప్పుడూ మాట్లాడలేదని, వారి గురించి నికోలిక్ ద్వారానే ఎప్స్టీన్‌కు తెలిసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. విచారణలో భాగంగా గేట్స్‌కు ఎప్పుడైనా లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే వ్యాధి (ఎస్‌టీడీ) సోకిందా అని కూడా ప్రశ్నించారు. దీనికి స్పందించిన గేట్స్, తనకు ఎప్పుడూ అలాంటి వ్యాధి రాలేదని స్పష్టం చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్‌లో మెలిండాకు రహస్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి గేట్స్ ప్రయత్నించినట్లు ప్రస్తావన వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

వివరాలు 

2011లో బోరిస్ నికోలిక్ ద్వారానే ఎప్స్టీన్ పరిచయం: గేట్స్

2011లో బోరిస్ నికోలిక్ ద్వారానే ఎప్స్టీన్ తనకు పరిచయమయ్యాడని గేట్స్ వెల్లడించారు. తన వివాహేతర సంబంధాల గురించి కూడా ఎప్స్టీన్‌కు సమాచారం అందించిన వ్యక్తి నికోలిక్ అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తన గురించి తెలిసిన ప్రతికూల అంశాలను, అలాగే వాస్తవం కాని కొన్ని విషయాలను కూడా ఎప్స్టీన్ తనకు తానే పంపుకునే డ్రాఫ్ట్ ఇమెయిల్స్‌లో నమోదు చేసుకునేవాడని గేట్స్ వ్యాఖ్యానించారు. ఈ విచారణ ప్రధానంగా ఎప్స్టీన్‌తో గేట్స్‌కు మరే ఇతర సంబంధాలు ఉన్నాయా అనే అంశాన్ని తెలుసుకునేందుకే నిర్వహించినట్లు తెలుస్తోంది.

Advertisement