కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు
ప్రపంచదేశాలను కోవిడ్ ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌పై చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు సంచలన నిజాలు బయటపెట్టారు. కరోనాను చైనానే 'బయో ఆయుధం'గా రూపొందించినట్లు చెప్పారు. నాలుగు కరోనా వైరస్ వేరియంట్లలో ఏది ఉత్తమంగా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడానికి మనుషులకు ఎక్కించినట్లు చెప్పారు. చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) గురించిన ప్రత్యక్ష సమాచారం, ప్రత్యేకమైన వార్తలను అందించే ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ జెంగ్‌తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వుహాన్‌కు చెందిన పరిశోధకుడు చావో షావో ఈ షాకింగ్ విషయాలు వెల్లడించారు. చైనాలో జన్మించిన మానవ హక్కుల కార్యకర్త, రచయిత్రి జెన్నిఫర్ జెంగ్ ఈ ఇంటర్వ్యూను చేశారు.
మిలిటరీ వరల్డ్ గేమ్స్ అథ్లెట్స్‌కు కరోనా సోకేలా చేసిన చైనా
జెన్నిఫర్ జెంగ్‌కు ఇచ్చిన ఇరవై ఆరు నిమిషాల ఇంటర్వ్యూలో వుహాన్‌కు ల్యాబ్ పరిశోధకుడు చావో షావో చాలా విషయాలు చెప్పారు. 2019వుహాన్‌లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సందర్భంగా తన సహ పరిశోధకులు చాలా మంది తప్పిపోయారని చావో షావో పేర్కొన్నారు. అయితే వారిని ఆరోగ్యం, పరిశుభ్రత పరిస్థితులను తనిఖీ చేయడానికి వివిధ దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు బస చేసిన హోటళ్లకు పంపినట్లు వెల్లడించారు. పరిశుభ్రతను తనిఖీ చేసే పని వైరాలజిస్టులు కాదని, వైరస్ వ్యాప్తి చేయడానికే తన సహచరులను అక్కడి ప్రభుత్వం పంపినట్లు చావో షావో చెప్పారు. మార్చి నుంచి ఏప్రిల్ 2020 మధ్య కాలంలో చావో షాన్ స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పైన పేర్కొన్న దిగ్భ్రాంతికరమైన సమాచారాన్ని వెల్లడించారు.