NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు
    తదుపరి వార్తా కథనం
    53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు
    53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు

    53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు

    వ్రాసిన వారు Stalin
    Mar 30, 2023
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకదనే అపోహ ఇన్నాళ్లూ ఉండేది. అయితే అది తప్పని తేలింది. తాజాగా చిలీ దేశంలో ఓ మనిషిలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించారు.

    ఈ వైరస్ పక్షులు లేదా సముద్ర క్షీరదాల నుంచి మానవులకు సంక్రమిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే మానవుని నుంచి మానవునికి సంక్రమించేది విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

    తీవ్రమైన ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో బాధపడుతున్న 53 ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించినట్లు చిలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే రోగి ఆరోగ్యం మాత్రం స్థిమితంగానే ఉందని వెల్లడించింది.

    చిలీ

    పౌల్ట్రీ ఎగుమతులను నిలిపివేసిన చిలీ

    బర్డ్ ఫ్లూ వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండే వ్యక్తులను గుర్తించే పనిలో ఆ దేశ అధికారులు నిమగ్నమయ్యారు. వారికి సైతం పరీక్షలు నిర్వహించి, వారిలో ఈ వైరస్ ఉందా? లేదా? అనేది తేల్చనున్నారు.

    చిలీ అడవి జంతువుల్లో గత సంవత్సరం చివర్లో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించారు.

    బర్డ్ ఫ్లూ కేసులు బయటకు రావడంతో చిలీ ప్రభుత్వం పౌల్ట్రీ ఎగుమతులను నిలిపివేసింది.

    అర్జెంటీనాలో కూడా బాయిలర్ కోళ్లలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి.

    అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగుమతిదారు బ్రెజిల్‌లో బర్డ్ ఫ్లూ జాడలు లేకపోవడం గమనార్హం.

    ఈ సంవత్సరం ప్రారంభంలో ఈక్వెడార్ 9ఏళ్ల బాలికలో, గతంలో చైనాలోని ఓ వ్యక్తిలో బర్డ్ ఫ్లూను గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తాజా వార్తలు

    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    మార్చి 25 నుంచి 30 మధ్య ఆకాశంలో అద్భుతం; ఓకే రాశిలో ఐదు గ్రహాలు గ్రహం
    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు పాకిస్థాన్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇజ్రాయెల్
    తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025