Page Loader
దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి
దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి

దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి

వ్రాసిన వారు Stalin
Mar 14, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో హెచ్‌3ఎన్2 ఇన్‌ప్లూయెంజా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. అయితే ఈ ఇన్‌ప్లూయెంజా వైరస్ సోకి మరణాలు సంభవిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. హెచ్‌3ఎన్2 వైరస్‌తో గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం ఒకరు చనిపోయారు. గుజరాత్‌లో తొలి మరణం. 58 ఏళ్ల మహిళ హెచ్‌3ఎన్2 వైరస్‌ బారిన పడి మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుజరాత్‌లో సంభవించిన మరణంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరుకుంది. కర్ణాటకలో తొలి మరణం నమోదైంది. కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన 82 ఏళ్ల వ్యక్తి హెచ్‌3ఎన్2 వైరస్‌ బారిన పడి మృతి చెందాడు.

గుజరాత్

మార్చి నెలాఖరు నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన వివరాలు ప్రకారం.. జనవరి 2 నుంచి మార్చి 5 మధ్య దేశంలో 451 హెచ్‌3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, మార్చి నెలాఖరు నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్‌ప్లూయెంజా వైరస్ చికిత్సకు స్వీయ మందులు, యాంటీబయాటిక్స్ వాడకాన్ని నివారించాలని ప్రజలను కోరుతూ ఐసీఎంఆర్ ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది. హెచ్‌3ఎన్2 అనేది మానవేతర ఇన్‌ప్లూయెంజా వైరస్ వైరస్, ఇది సాధారణంగా పందుల్లో వ్యాపిస్తుందని, మానవులకు సోకుతుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది.