Page Loader
Bob Moore: కంపెనీలో పనిచేసే ఉద్యోగులనే యజమానులుగా చేసిన మిలియనీర్ ఇక లేరు 
Bob Moore: కంపెనీలో పనిచేసే ఉద్యోగులనే యజమానులుగా చేసిన మిలియనీర్ ఇక లేరు

Bob Moore: కంపెనీలో పనిచేసే ఉద్యోగులనే యజమానులుగా చేసిన మిలియనీర్ ఇక లేరు 

వ్రాసిన వారు Stalin
Feb 21, 2024
06:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బాబ్స్ రెడ్ మిల్ వ్యవస్థాపకుడు బాబ్ మూర్(94) కన్నుమూశారు. ఫిబ్రవరి 10 మూర్ తుది శ్వాస విడిచినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. బాబ్స్ రెడ్ మిల్ కంపెనీని ఆయన 1978 లో స్థాపించారు. నాణమైన చిరుధాన్యాల ఉత్పత్తుల అందించే కంపెనీగా ఇది ప్రసిద్ధి గాంచింది. కంపెనీలో మొత్తం వాటాను ఉద్యోగులకే రాసిచ్చి ఈయన బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం కంపెనీ పూర్తిగా ఉద్యోగుల యాజమాన్యంలోనే ఉంది. బాబ్ మూర్ 2010 లో తన 81 పుట్టినరోజు సందర్భంగా కంపెనీలో మొత్తం వాటాను 209 మంది ఉద్యోగులకు అప్పగించారు. అప్పటికే ఆయన యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

అమెరికా

ప్రస్తుతం కంపెనీలో 700 మంది ఉద్యోగులు

కంపెనీని కేవలం లాభాల కోసమే నడపకుండా దాని అభివృద్ధిలో భాగమైన ఉద్యోగులకు పట్ల దయతో ఉండాలనేదే తన ఆలోచన అని మూర్ చెప్పారు. కంపెనీని విక్రయించాలని చాలా మంది తనను సంప్రదించారని, కానీ తాను మాత్రం దాని ఎదుగదలలో కీలక పాత్ర వహించిన ఉద్యోగులకు వాటా ఇవ్వాలనుకున్నట్లు మూర్ చెప్పారు. కంపెనీ విలువ 2018 నాటికే 100 మిలయన్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. 70 కి పైగా దేశాల్లో 200 కు పైగా ఉత్పత్తులను అందిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 700 కు చేరింది. మూర్ మృతి పట్ల ఉద్యోగులంతా సంతాపం ప్రకటించారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగులను యజమానులుగా మార్చిన ఆయన గొప్పతనాన్ని కీర్తించారు.