
United Airlines plane: హవాయి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం.. టైరులో వ్యక్తి మృతదేహం
ఈ వార్తాకథనం ఏంటి
విమానం టైరులో వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.
హవాయి ద్వీపంలోని కహులుయీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో అధికారులు ఓ మృతదేహాన్ని గుర్తించారు.
ఈ విమానం షికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇది వచ్చింది.
అయితే, ఈ మృతదేహం విమానం టైరులో ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ప్రకారం, "విమానాల వీల్ వెల్‌కు ఎవరైనా విమానం బయట నుంచి మాత్రమే ప్రవేశించగలరు. అయితే, ఆ వ్యక్తి అక్కడికి ఎలా చేరాడు అనే విషయం దర్యాప్తు లో ఉంది" అని తెలిపారు.
వివరాలు
చట్టవిరుద్ధంగా ప్రయాణించేందుకు.. ఈ తరహా ప్రమాదకరమైన పద్ధతులు
అలాగే, మృతుడి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు.
చట్టవిరుద్ధంగా ప్రయాణించేందుకు ప్రయత్నించే వ్యక్తులు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ తరహా ప్రమాదకరమైన పద్ధతులను ఉపయోగిస్తుంటారు.
ఇలాంటి ప్రయత్నాలు చేసిన వ్యక్తులు సజీవంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువ.
వీల్ వెల్ స్థలంలో ఇరుకుగా ఉండటంతో, ల్యాండింగ్ గేర్ తిప్పినప్పుడు ఆ వ్యక్తులు మరణించడానికి ఆస్కారం ఉంటుంది.
గతంలో ఒక వ్యక్తి మాత్రం ఇలాంటి పరిస్థితి నుంచి సజీవంగా బయటపడాడు.
ఫ్రాన్స్‌లో జరిగిన ఈ ఘటనలో, ఆ వ్యక్తి విమానంలోని అండర్ క్యారేజ్ బేలో ప్రయాణిస్తూ విమాన సిబ్బంది ద్వారా సజీవంగా గుర్తించబడ్డాడు.