
Pakistan: బలూచిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు సైనికులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆదివారం సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన నోష్కి ప్రాంతంలో చోటు చేసుకోగా, ఐదుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆత్మాహుతి దాడిగా గుర్తించారు.
నోష్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఓ ప్రముఖ మీడియా సంస్థకు పంపిన మెయిల్‌లో, తమ 'ఫిదాయీ యూనిట్' మజీద్ బ్రిగేడ్ పాక్ మిలిటరీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు పేర్కొన్నారు.
Details
కొద్దిరోజులుగా బలోచిస్థాన్ లో ఉద్రిక్త పరిస్థితులు
ఆ కాన్వాయ్‌లో ఎనిమిది బస్సులు ఉండగా, ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైందని, మరో బస్సును తమ ఫతే స్క్వాడ్ చుట్టుముట్టి అందులో ఉన్న సైనికులను హతమార్చిందని తెలిపారు.
ఈ దాడిలో 90 మంది పాక్ సైనికులు మరణించినట్లు బీఎల్‌ఏ ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా బలోచిస్థాన్‌లో భద్రతా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
ఇటీవల బలోచ్ మిలిటెంట్లు ఓ ప్రయాణికుల రైలును హైజాక్ చేసి, అనేక మంది ప్రాణాలు తీసిన ఘటన మరవకముందే, ఇప్పుడు మిలిటరీ కాన్వాయ్‌పై మరో దాడి జరిగింది.
అధికారిక నివేదికల ప్రకారం ఈ బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు.