Israel: దిల్లీలో బాంబు పేలుడు.. సంఘీభావం తెలిపిన ఇజ్రాయెల్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎర్రకొట ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర కారు బ్లాస్ట్ దేశవ్యాప్తంగా భయాందోళన రేకెత్తించింది. కారులో అమోనియం నైట్రేట్ నింపి పాల్పడిన ఈ దాడికి అనుమానితుడిగా డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌ను గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మృతిచెందారు. కేసు దర్యాప్తు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కు అప్పగించబడింది. దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యధిక స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా భూటాన్ పర్యటనలో ఉన్నప్పటికీ, ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులకైనా వదిలివేయరని కచ్చితంగా హెచ్చరించారు.
Details
భారత్ కు అండగా నిలుస్తాం
ఈ ఘటనపై ఇజ్రాయిల్ స్పందించింది. ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ మాట్లాడుతూ భారత ప్రజలకు, ముఖ్యంగా ఢిల్లీలోని నడిబొడ్డున జరిగిన పేలుడులో మరణించిన అమాయకుల కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయిల్ భారతదేశంతో నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటన దేశీయ భద్రతా సంస్థలకు పెద్ద హెచ్చరికగా నిలిచింది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.