
Somalia: సోమాలియాలో ఆత్మాహుతి దాడి..5గురి మృతి, పలువురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
సోమాలియా రాజధాని మొగదిషులో ఆత్మాహుతి దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు.
పలువురికి గాయాలు అయ్యాయి.
స్పెయిన్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌ని వీక్షిస్తున్నసమయంలో ఈ దాడి జరిగింది.
యూరో అభిమానులతో నిండిన కేఫ్‌లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి.
వీటిని ఇంకా ధృవీకరించలేదు.
కేఫ్‌లో పొగలు, మంటలు ఎగిసి పడుతున్నాయి.
ఇటీవలే ప్రారంభించిన "టాప్ కాఫీ" అనే కేఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్థానిక మీడియా సంస్థలు సంఘటనా స్థలంలో కాల్పులు జరిపినట్లు తెలిపాయి.
జర్నలిస్ట్ హరున్ మరుఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ధృవీకరించని కధనాలను పంచుకున్నారు. సాక్షులు "బహుళ ప్రాణనష్టం" చూశారని పేర్కొన్నారు.
వివరాలు
జర్నలిస్ట్ హరున్ మరుఫ్ ఇలా తెలిపారు
ఈ వార్తలను పోలీసులు లేదా ఇతర సంబంధిత అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
అయితే స్థానిక మీడియా మృతుల లెక్కలను తెలిపింది.
భవనం ఇప్పుడు పాక్షికంగా కూలిపోయిందని నేలపై మృతదేహాలు ఉన్నాయని పేర్కొన్నది.
ప్రాథమిక పోలీసు నివేదికలు ఐదుగురు మృతులు , సుమారు 20 మంది గాయపడినట్లు నిర్ధారించాయి.
SONNA పోలీసు ప్రతినిధి మేజర్ అబ్దిఫితా అడెన్ హసన్ స్టాట్‌తో మాట్లాడారు.
ఈ మధ్య కాలంలో సోమాలియా చాలా ప్రశాంతంగా వుంటుంది. అధ్యక్షుడు హసన్ షేఖ్ ఉగ్రవాదులను అణిచి వేయడానికి కంకణం కట్టుకుని పని చేస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం జరిగిన పేలుడు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తుంది.