LOADING...
Australia: ఆస్ట్రేలియా బోండీ బీచ్‌లో ఉగ్రఘాతుకం తండ్రీకొడుకుల పనే..!
ఆస్ట్రేలియా బోండీ బీచ్‌లో ఉగ్రఘాతుకం తండ్రీకొడుకుల పనే..!

Australia: ఆస్ట్రేలియా బోండీ బీచ్‌లో ఉగ్రఘాతుకం తండ్రీకొడుకుల పనే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రసిద్ధి చెందిన బోండీ బీచ్ వద్ద యూదుల హనుక్కా పండుగ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటనను పోలీసులు ఉగ్రవాద దాడిగా గుర్తించారు. ఈ హింసాత్మక ఘటనకు పాల్పడింది ఒక ఇద్దరు సాయుధులను తండ్రీకొడుకులుగా దర్యాప్తు బృందం గుర్తించింది. వీరిని నవీద్‌ అక్రమ్‌ (24),సాజిద్‌ అక్రమ్‌ (50) అని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్ర ఏమీ లేదని పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ స్పందిస్తూ, పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 50 ఏళ్ల తండ్రి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.

వివరాలు 

బోనీరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో ఉన్న రెండు ఇళ్లపై పోలీసులు దాడులు

అతడి కుమారుడు అయిన 24 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడటంతో, ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. దర్యాప్తు భాగంగా సిడ్నీ పరిసర ప్రాంతాల్లోని బోనీరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో ఉన్న రెండు ఇళ్లపై పోలీసులు దాడులు చేసి సోదాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. మరణించిన 50 ఏళ్ల వ్యక్తి చట్టబద్ధమైన తుపాకీ లైసెన్సు కలిగినవాడని, అతడి పేరపై ఆరు తుపాకులు నమోదు అయ్యి ఉన్నాయని కమిషనర్ ధృవీకరించారు. ఈ దాడిలో అవే ఆయుధాలను ఉపయోగించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

వివరాలు 

ఘటన జరిగిన ప్రాంతం సమీపంలో రెండు శక్తివంతమైన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైజ్‌లు

అలాగే ఘటన జరిగిన ప్రాంతం సమీపంలో రెండు శక్తివంతమైన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైజ్‌లు (IEDలు) గుర్తించి, వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఈ దాడికి దారితీసిన కారణాలు, ఉద్దేశాలపై విచారణ కొనసాగుతోందని కమిషనర్ చెప్పారు. సంఘటనా స్థలంలో ఐసిస్ జెండా లభించిందన్న ప్రచారంపై ఆయన స్పందించలేదు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీసు అధికారులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రార్థనా స్థలాల వద్ద కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement