తదుపరి వార్తా కథనం

Brazil: కుర్చీతో ప్రత్యర్థిపై దాడి చేసిన బ్రెజిల్ మేయర్ అభ్యర్థి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 18, 2024
09:52 am
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్‌లో మేయర్ అభ్యర్థుల మధ్య జరిగిన చర్చ వివాదాస్పదమైంది. లైవ్ టీవీలో ప్రత్యర్థిపై బ్రెజిల్ మేయర్ అభ్యర్థి కుర్చీతో దాడి చేశారు.
పాబ్లో మార్కల్ ప్రసంగం చేస్తున్న సమయంలో జోస్ లూయిజ్ ఆకస్మాత్తుగా వచ్చి దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత మార్కల్ పక్కటెముకల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.
వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మార్కల్ ఛాతీకి, మణికట్టుకు గాయాలయ్యాలని, అయితే పెద్ద గాయాలు కాలేదని వైద్యులు తెలియజేశారు.
Details
లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతోనే దాడి
గతంలో తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఈ చర్యకు పాల్పడ్డానని జోస్ లూయిజ్ పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితుడు పోలీసులను అశ్రయించారు.
దాడి ముగిసిన తర్వాత ఇక మిగిలిన అభ్యర్థులు గిల్హెర్మ్ బౌలోస్, మెరీనా హెలెనా, రికార్డో న్యూన్స్, టబాటా అమరల్ చర్చను కొనసాగించారు.