Page Loader
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో సంప్రదాయాలకు బ్రేక్‌.. కొత్త పోప్ కోసం రేసులో ఏడుగురు? 
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో సంప్రదాయాలకు బ్రేక్‌.. కొత్త పోప్ కోసం రేసులో ఏడుగురు?

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో సంప్రదాయాలకు బ్రేక్‌.. కొత్త పోప్ కోసం రేసులో ఏడుగురు? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యాథ‌లిక్ మ‌త‌పెద్ద పోప్ ఫ్రాన్సిస్‌ ఈ రోజు కన్నుమూశారు. సాధారణంగా పోప్‌ల అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా, ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే దివంగత పోప్ ఫ్రాన్సిస్‌ మాత్రం ఈ ప్రక్రియలో మార్పులు తీసుకురావాలన్న అభిప్రాయంతో కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. ఇప్పటి వరకూ పోప్‌లను మూడు వేర్వేరు పదార్థాలతో తయారైన శవపేటికల్లో ఖననం చేయడం సంప్రదాయం. ఇందులో సైప్రస్ చెట్టు, సీసం, సిందూర వృక్షం వాడుతారు. అయితే ఈ సంప్రదాయాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఖండించారు. తన శవాన్ని సాధారణ చెక్కతో తయారైన శవపేటికలో ఉంచాలని సూచించారు. ఇది జింక్ ఖనిజ పట్టీతో కవర్ చేసి ఉంటుంది.

Details

కాటాఫల్క్‌కు గుడ్‌బై 

సాధారణంగా వాటికన్ సిటీలోని సెయింట్ పీట‌ర్స్ బాసిలికా చర్చిలో ఉన్న కాటాఫల్క్ అనే ఎత్తైన ప్రదేశంలో పోప్ పార్దీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచే సంప్రదాయం ఉంది. కానీ ఈ పద్ధతిని కూడా ఫ్రాన్సిస్ రద్దు చేశారు. బదులుగా శవపేటికలోనే పార్దీవదేహాన్ని ఉంచి, కప్పును తీసి ప్రజల తుది దర్శనానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఖననం స్థలం మార్పు ఇప్పటి వరకు పోప్‌లు తుదిశ్వాస విడిచిన తరువాత వారిని సాధారణంగా వాటికన్‌లోనే ఖననం చేస్తారు. కానీ ఈసారి, ఇది గత శతాబ్ద కాలంలో తొలిసారి రోమన్ క్యాథలిక్ మతపెద్దను వేరే చోట ఖననం చేయనున్నారు. పోప్ ఫ్రాన్సిస్‌ను రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో ఖననం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Details

రహస్యంగా ఓటింగ్

ఇక పోప్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు అమలులోకి వచ్చే కొన్ని నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం తదుపరి పోప్ ఎన్నిక జరుగుతుంది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను కార్డినల్ జియోవన్నీ బాటిస్టా రే (91) నేతృత్వంలో నిర్వహిస్తారు. ఆయనే కార్డినల్స్ కళాశాల డీన్‌గా కొనసాగుతున్నారు. అంత్యక్రియల అనంతరం సిస్టిన్ చాపెల్‌లో రహస్య ఓటింగ్ ద్వారా తదుపరి పోప్ ఎన్నిక జరుగుతుంది. ఓటింగ్ విధానం ఎలా? 80 ఏళ్ల లోపు వయస్సు కలిగిన కార్డినల్స్ కళాశాల సభ్యులు మాత్రమే ఓటింగ్‌కు అర్హులు. ఓటింగ్ రహస్యంగా జరుగుతుంది. కొత్త పోప్ ఎంపికకు కనీసం రెండు-మూడొంతుల మెజారిటీ అవసరం.

Details

పోప్ పదవి కోసం పోటీలో ఉన్నవారు

కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే (ఫిలిప్పీన్స్) కార్డినల్ పియెట్రో పారోలిన్ (ఇటలీ) కార్డినల్ పీటర్ ఎర్డో (హంగేరీ) కార్డినల్ రేమండ్ లియో బర్క్ (అమెరికా) కార్డినల్ మత్తేయో జుప్పి (ఇటలీ) కార్డినల్ విలెం ఎయిక్ (నెదర్లాండ్స్) కార్డినల్ మారియో గ్రెచ్ (మాల్టా)