Loading...
wedding photoshoot: పెళ్లి ఫొటోషూట్‌లో ఊహించని ప్రమాదం.. గాలిలోకి ఎగిరిన వధువు!.. వీడియో వైరల్
పెళ్లి ఫొటోషూట్‌లో ఊహించని ప్రమాదం.. గాలిలోకి ఎగిరిన వధువు!.. వీడియో వైరల్

wedding photoshoot: పెళ్లి ఫొటోషూట్‌లో ఊహించని ప్రమాదం.. గాలిలోకి ఎగిరిన వధువు!.. వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెళ్లికి ముందు అందమైన ఫొటోలు దిగాలనుకుంది. అందుకోసం ప్రత్యేకంగా ఫొటోషూట్‌ ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం భారీ బెలూన్లతో ముస్తాబై సముద్ర తీరానికి వెళ్లింది. అంతా అనుకున్నట్లుగానే జరుగుతోందని భావిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. బలంగా వీచిన గాలులకు చేతిలోని భారీ బెలూన్లు పైకి ఎగిరాయి. వాటిని పట్టుకున్న వధువు కూడా గాలిలోకి లేచే పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఫొటోగ్రాఫర్‌ సమయస్ఫూర్తితో స్పందించడంతో ప్రమాదం తప్పింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు 

అసలేం జరిగిందంటే..

టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న బోస్ఫరస్‌ జలసంధి తీరంలో ఓ యువతి తన పెళ్లికి ముందు ఫొటోషూట్‌ కోసం వెళ్లింది.

ఫొటోలు ప్రత్యేకంగా, అందంగా రావాలనే ఉద్దేశంతో పెద్ద సైజులో ఉన్న లేత గోధుమ రంగు బెలూన్లను చేతిలో పట్టుకుంది.

వాటితో కెమెరా ముందు వివిధ భంగిమల్లో పోజులిచ్చింది. అయితే ఫొటోషూట్‌ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి.

దీంతో ఆమె చేతిలోని భారీ బెలూన్లు గాలికి పైకి ఎగిరాయి. వాటిని గట్టిగా పట్టుకున్నప్పటికీ గాలి వేగాన్ని తట్టుకోలేక వధువు ఇబ్బందిపడింది.

ఓ బలమైన గాలి తాకిడికి బెలూన్లు ఆమెను సమీపంలోని సముద్రపు గోడ వైపు లాగాయి.

వివరాలు 

అసలేం జరిగిందంటే..

ఈ క్రమంలో ఆమె కాళ్లు నేలపై నిలవకపోవడంతో దాదాపు గాల్లోకి ఎగిరే పరిస్థితి ఏర్పడింది.

సమీపంలోని బ్రిడ్జీని ఢీకొనే ప్రమాదం ఉందని గుర్తించిన ఫొటోగ్రాఫర్‌ వెంటనే అప్రమత్తమయ్యాడు.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా వధువును గట్టిగా పట్టుకుని కిందకు లాగాడు. దీంతో ఆమె సురక్షితంగా బయటపడింది.

ఫొటోగ్రాఫర్‌ వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పెళ్లికి ముందు అందమైన జ్ఞాపకాలు సొంతం చేసుకోవాలనుకుంటే.. జీవితాంతం గుర్తుండిపోయే భయానక అనుభవం ఎదురైందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఈ వీడియోపై పలువురు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఫొటోషూట్‌ కోసం చేసిన ఏర్పాట్లు చివరకు ఊహించని ప్రమాదానికి దారితీశాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

ADVERTISEMENT