Loading...
British Airways: 30 టన్నుల ఇంధనం డంపింగ్‌.. 4 గంటల 47 నిమిషాలు గాల్లోనే విమానం
30 టన్నుల ఇంధనం డంపింగ్‌.. 4 గంటల 47 నిమిషాలు గాల్లోనే విమానం

British Airways: 30 టన్నుల ఇంధనం డంపింగ్‌.. 4 గంటల 47 నిమిషాలు గాల్లోనే విమానం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానానికి గాల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. లండన్‌ నుంచి షికాగోకు బయల్దేరిన సుమారు గంట తర్వాత ఐర్లాండ్‌ మీదుగా 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే అత్యవసర పరిస్థితిని సూచించే ఎమర్జెన్సీ కోడ్‌ 7700ను ప్రకటించారు.

వివరాలు 

37 వేల అడుగుల నుంచి 28 వేల అడుగుల పతనం

సాంకేతిక లోపం కారణంగా విమానం వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది.

ఒక్కసారిగా సుమారు 28 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది.

ఈ ఎత్తు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా ఎత్తు (2,722 అడుగులు) కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ.

అలాగే పారిస్‌లోని ఐఫిల్‌ టవర్‌ (1,024 అడుగులు) కంటే సుమారు 27 రెట్లు అధికం.

విమానం అకస్మాత్తుగా భారీగా కిందికి దూసుకురావడంతో తీవ్ర కుదుపులకు గురైంది.

దీంతో క్యాబిన్‌లలోని ఆక్సిజన్‌ మాస్కులు బయటకు వచ్చి ప్రయాణికులపై పడ్డాయి.

ఈ పరిణామంతో విమానంలో ఉన్నవారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

వివరాలు 

30 టన్నుల ఇంధనాన్ని గాల్లోకి డంపింగ్

విమానం ఇంధనంతో నిండుగా ఉన్న సమయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేస్తే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

విమానం బరువును తగ్గించేందుకు ఇంధనాన్ని గాల్లోకి వదిలేయాలని నిర్ణయించారు.

అలా ఇంగ్లిష్‌ ఛానల్‌పై సుమారు 9వేల అడుగుల ఎత్తులో 4గంటల 47నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టింది.

ఈ సమయంలో దాదాపు 30టన్నుల ఇంధనాన్ని గాల్లోకి డంప్‌ చేసింది.

అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

ల్యాండింగ్‌ అనంతరం ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.

విమానాన్ని సాంకేతిక పరీక్షల కోసం తరలించారు. అయితే విమానంలో అసలు ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తిందనే విషయాన్ని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం వెల్లడించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

విమానంలో 180 మంది

ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి సుమారు 180 మంది ఉన్నట్లు సమాచారం.

ఇటీవల ఫ్లైదుబాయ్‌ విమానంలోనూ అత్యవసర పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.

అదే సమయంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు అసలు కారణమేంటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎమర్జెన్సీ కోడ్‌ 7700.. ఇంధనం ఖాళీ చేసి హీత్రూకు చేరిన విమానం

ADVERTISEMENT