USA: అక్రమ వలసదారులకు బంఫర్ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడితే రూ.2,600 డాలర్లు
ఈ వార్తాకథనం ఏంటి
స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లే అక్రమ వలసదారులకు (self-deportation) 2,600 డాలర్ల (సుమారు రూ.2,40,329) ఎగ్జిట్ బోనస్ ఇవ్వనున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. అలాగే వారి స్వదేశాలకు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. 'సీబీపీ హోమ్' యాప్ ద్వారా తాము స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమని తెలిపే వలసదారుల పేర్లను, బలవంతంగా పంపించాల్సిన జాబితా నుంచి తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా స్వచ్ఛందంగా వెళ్లే వారికి సులభతర మార్గాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.
Details
22 లక్షలకు పైగా అక్రమ వారి దేశాలకు వెళ్లారు
అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపే చర్యలను 2025 జనవరి నుంచి అమెరికా ప్రారంభించిందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆఫర్లను ఉపయోగించుకుని ఇప్పటివరకు 22 లక్షలకు పైగా అక్రమ వలసదారులు తమ దేశాలకు తిరిగి వెళ్లినట్లు వెల్లడించింది. అమెరికాలో అక్రమంగా ఉన్నవారికి స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లడం అత్యంత సురక్షితమైనదిగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్గాన్ని ఎంచుకుంటే అరెస్టు వంటి సమస్యలను కూడా నివారించవచ్చని సూచించింది.