LOADING...
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌.. కెనడాలో అరెస్టు 
ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌.. కెనడాలో అరెస్టు

Canada: ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌.. కెనడాలో అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ను కెనడాలో పోలీసులు అరెస్టు చేశారు. అతను సిఖ్స్ ఫర్ జస్టిస్‌ (SFJ) అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నగురుపత్వంత్ సింగ్ పన్నూన్ కు సన్నిహితుడని తెలుస్తోంది. 2023 నుండి గోసల్‌ కెనడాలో SFJ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడని సమాచారం ఉంది. ఆయుధాలు కలిగిఉండటం సహా పలు అభియోగాలపై తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గత నవంబర్‌లోనూ కెనడా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ సమయంలో అతను గ్రేటర్ టొరంటో ప్రాంతంలో ఒక హిందూ ఆలయం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతనికి షరతులతో బెయిల్ మంజూరు చేయబడింది.

వివరాలు 

పునరుద్ధరణ ప్రయత్నాలు మొదలుపెట్టిన ఇరు దేశాలు

ఈ అంగీకారం కింద, ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడంలో రెండు దేశాలు సమన్వయం చేసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొనబడింది. గోసల్‌ అరెస్టు ఈ నేపథ్యంలో చోటుచేసుకోవడం ప్రత్యేకమైనది. సాంకేతికంగా, 2023లో ఒక సిక్కు వేర్పాటువాది హత్యకు సంబంధించి భారత్-కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత, ఇరు దేశాలు పునరుద్ధరణ ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

వివరాలు 

అజిత్ దోవల్,నథాలీ డ్రౌయిన్‌ల మధ్య చర్చలు

ఇందులో భాగంగా, భారత్, కెనడా రాయబారులను తిరిగి నియమించుకున్నాయి. ఆ తరువాత, సంబంధాల పునరుద్ధరణ లక్ష్యంగా దేశ రక్షణ సలహాదారు అజిత్ దోవల్, కెనడా భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్‌ల మధ్య చర్చలు జరిగాయి. అలాగే, జూన్‌లో కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి ప్రధాని మార్క్ కార్నీతో ఇరు దేశాల సంబంధాలపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.