Canada Biggest Gold Heist: కెనడా టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో భారీ బంగారం దోపిడి.. కీలక నిందితుడు భారత్‌లో..!
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా టొరంటో ఎయిర్‌పోర్టులో మూడు సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న పెద్ద బంగారం దోపిడి కేసులో (Canada Biggest Gold Heist) కెనడా పోలీసులు తాజాగా ఓ నిందితుడిని అరెస్టు చేశారు అతడి పేరు అర్సలాన్ చౌధరీ అని అధికారులు వెల్లడించారు. సీనియర్ పోలీసులు చెప్పినట్లుగా, అతడికి స్థిరమైన చిరునామా లేదు. ఈ నేపథ్యంతో, దుబాయ్ నుంచి టొరంటోకి పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో అడుగుపెట్టగానే ఆయనను అరెస్టు చేశారు. అయితే, ఈ దోపిడి కేసులో మరో కీలక నిందితుడు సిమ్రన్‌ప్రీత్ పనేసర్ భారతదేశంలోనే ఉన్నట్లు సమాచారం.
వివరాలు
కేసు నేపథ్యం:
2023 ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్ నుండి టొరంటోకి ఒక కార్గో విమానం వచ్చి దిగింది. ఆ విమానంలోని ఒక కంటైనర్‌లో 400 కేజీల బరువున్న 6,600 బంగారు కడ్డీలు ఉన్నట్లు గుర్తించబడింది. వాటి మొత్తం విలువ 20 మిలియన్ కెనడియన్ డాలర్లు. అదేవిధంగా, ఆ కంటైనర్‌లో 2.5 మిలియన్ కెనడియన్ డాలర్ల నగదు కూడా ఉంది. ఈ బంగారం, నగదును టొరంటోలోని బ్యాంక్‌లో భద్రపరచడానికి తీసుకెళ్ళారు. విమానం దిగగానే కంటైనర్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని వేర్‌హౌస్ ఫెసిలిటీలో ఉంచారు. అయితే, కంటైనర్‌ను తదుపరి రోజు తనిఖీ చేసినప్పుడు, బంగారం మరియు నగదు మాయం అయ్యాయని తేలింది.
వివరాలు
దర్యాప్తు వివరాలు:
కెనడా(Canada) చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా అప్పట్లో ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వేర్‌హౌస్ సిబ్బంది నకిలీ పత్రాలను ఉపయోగించి కంటైనర్‌లోని బంగారాన్ని మాయ చేసారని దర్యాప్తు ద్వారా కనుగొన్నారు. ఆ సమయంలో ఇద్దరు భారతీయులు.. సిమ్రన్‌ప్రీత్, పరంపాల్ సిద్ధు వేర్‌హౌస్‌లో పని చేస్తున్నారు. వీరితో పాటు, మొత్తం 9 మందిపై కేసు నమోదు చేయబడింది. ఇప్పటి వరకు, పరంపాల్‌ను అరెస్టు చేసినా, సిమ్రన్‌ప్రీత్ పరారీలో ఉన్నారు. పోలీసులు మాయమైన బంగారాన్ని ఇంకా గుర్తించలేకపోతున్నారు, కానీ కొన్ని నగదు మొత్తాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.