Canada: భారతీయ వీసా దరఖాస్తుదారులకు కెనడా ఊరట.. ప్రాసెసింగ్ సమయం తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ వీసా దరఖాస్తుదారులకు కెనడా ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. తాత్కాలిక నివాసానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేస్తూ ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. ఈ మేరకు ఆ దేశ వలస శాఖ తాజాగా వివరాలను వెల్లడించింది. విజిటర్ వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని గతంలో ఉన్న 37 రోజుల నుంచి 23 రోజులకు తగ్గించారు.
వివరాలు
సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయం కూడా తగ్గింపు
అలాగే చదువు కోసం వెళ్లే వారికి ఇచ్చే స్టడీ పర్మిట్ వీసా ప్రాసెసింగ్‌ను 4 వారాల నుంచి 3 వారాలకు కుదించారు. కుటుంబ సభ్యులను దీర్ఘకాలంగా కలుసుకునే అవకాశమిచ్చే సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని 202 రోజుల నుంచి 182 రోజులకు తగ్గించినట్లు తెలిపారు. తాత్కాలిక వీసా విభాగాల్లో ఈ మార్పులు దరఖాస్తుదారులకు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. అయితే దరఖాస్తుల సంఖ్య, వాటి రకం, అలాగే అధికారులపై ఉన్న పనిభారం ఆధారంగా ప్రాసెసింగ్ సమయం మారవచ్చని కెనడా అధికారులు స్పష్టం చేశారు.