Canada: డొనాల్డ్ ట్రంప్ విధానాల నుండి "ఎవరూ సురక్షితంగా లేరు".. జీ7 దేశాలను హెచ్చరించిన కెనడా
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య యుద్ధ భయాలు జి-7 దేశాలను వెంటాడుతున్నాయి. తాజాగా జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో వాణిజ్య యుద్ధం ప్రధాన చర్చా అంశంగా మారింది.
ఈ సందర్భంగా కెనడా విదేశాంగ మంత్రి మెలానియో జోలీ, అమెరికాతో తీవ్రమవుతున్న వాణిజ్య పోరాటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
అగ్రరాజ్యం తీసుకుంటున్న నిర్ణయాలు మిగతా దేశాలపై ప్రభావం చూపుతాయని, అంతకంటే ముందు జాగ్రత్తలు అవసరమని ఆమె హెచ్చరించారు.
"అత్యంత సన్నిహిత మిత్రదేశమైన మాతోనే అమెరికా ఇలా ప్రవర్తిస్తే, ఇక ఇతర దేశాలు సురక్షితంగా ఉండలేవు" అని ఆమె వ్యాఖ్యానించారు.
రాబోయే విపత్తును ముందుగా అంచనా వేసి, మిత్రదేశాల మద్దతును కూడగట్టేందుకు కెనడా ఈ చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
కెనడా 51వ రాష్ట్రం అయితే,సరిహద్దు సమస్యలు,ఫెంటెనిల్ తలెత్తే అవసరం ఉండదు
ఇక ట్రంప్ తరచూ కెనడా సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్నవ్యాఖ్యలపై కూడా జోలీ ఈ సమావేశంలో స్పందించారు.
అలాంటి బెదిరింపులకు తమ దేశం వెనుకంజ వేయదని స్పష్టం చేశారు.యుద్ధ విన్యాసాలు,ఆయుధ తయారీ వంటి చర్యలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కీలకమైనవి అని ఆమె అభిప్రాయపడ్డారు.
మరోవైపు,అమెరికా మంత్రి మార్కో రూబియో మాత్రం ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకునే ప్రయత్నం చేశారు.
"ఆర్థిక పరంగా కెనడాను 51వ రాష్ట్రంగా చూడాలని ట్రంప్ ఆకాంక్షించారని మాత్రమే అర్థం చేసుకోవాలి" అని వివరణ ఇచ్చారు.
"కెనడా 51వ రాష్ట్రం అయితే,సరిహద్దు సమస్యలు,ఫెంటెనిల్ తలెత్తే అవసరం ఉండదు"అన్నదే ట్రంప్ భావన అని రూబియో పేర్కొన్నారు.
జి-7 సమావేశం కెనడా ఆక్రమణపై చర్చించేందుకు కాదు,అసలు లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
వివరాలు
అమెరికా-కెనడా సంబంధాల్లో తీవ్ర ఒడిదుడుకులు
చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికా-కెనడా సంబంధాలు పతనమయ్యాయి.
తొలుత ట్రంప్, కెనడా ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాన్ని విధిస్తానని ప్రకటించినా, అనంతరం 25%గా పరిమితం చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన కెనడా, అమెరికా నుంచి దిగుమతి అయ్యే 20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.