
Canada: విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను 35శాతం తగ్గించిన కెనడా.. భారతీయులపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఆ దేశం పిడుగు లాంటి వార్త చెప్పింది.
2023తో పోలిస్తే ఈ సంవత్సరం అంతర్జాతీయ విద్యార్థుల అనుమతులను మూడింట ఒక వంతుకు తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి ప్రకటించారు.
వీసా అనుమతులను 35 శాతం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే విద్యార్థి వీసాలపై రెండేళ్ల పరిమితిని విధించినట్లు చెప్పారు.
కెనడా 2023లో రికార్డు స్థాయిలో 579075 స్టడీ వీసాలను జారీ చేసింది. అయితే ఏడాది ఆ సంఖ్య 364000కి తగ్గుతుంది.
కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై పెను ప్రభావం చూపనుంది.
కెనడా
కెనడాలో గృహాల సమస్య
2022లో కెడనా స్టడీ పర్మిట్‌లను అందుకున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు 41 శాతానికి పైగా ఉన్నారు.
2023లో 3,00,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లినట్లు సీబీసీ న్యూస్ నివేదించింది.
కెనడాలో ప్రస్తుతం 3,40,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఒక మిలియన్ దాటింది.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత, కెనడా 2023లో రికార్డు స్థాయిలో 5,79,075 స్టడీ వీసాలను జారీ చేసింది.
విద్యార్థుల రావడం పెరగడంతో దేశంలో గృహాల సమస్య తలెత్తింది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కెనడా ప్రభుత్వం స్టడీ వీసాలను తగ్గించాలని నిర్ణయించింది.