Page Loader
Canada PM: మార్చి 9న ప్రధాని ట్రూడో స్థానంలో కెనడాకు కొత్త ప్రధాని.. ప్రకటించిన లిబరల్‌ పార్టీ
Canada PM: మార్చి 9న ప్రధాని ట్రూడో స్థానంలో కెనడాకు కొత్త ప్రధాని.. ప్రకటించిన లిబరల్‌ పార్టీ

Canada PM: మార్చి 9న ప్రధాని ట్రూడో స్థానంలో కెనడాకు కొత్త ప్రధాని.. ప్రకటించిన లిబరల్‌ పార్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కెనడా ప్రధానమంత్రి పదవితో పాటు అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి కూడా రాజీనామా చేస్తునట్లు ట్రూడో తెలిపారు. సోమవారం ఒట్టావాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ట్రూడో రాజీనామా నిర్ణయంతో కెనడాలో తదుపరి ప్రధాని ఎవరవుతారన్న ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ కీలక ప్రకటన చేస్తూ,మార్చి 9న కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని తెలిపింది.

వివరాలు 

ప్రధాన పోటీదారుగా అనితా ఆనంద్ 

"లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా మార్చి 9న కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనుంది. 2025 ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉంది" అని ఆ పార్టీ అధ్యక్షుడు సచిత్ మెహ్రా ప్రకటనలో తెలిపారు. పార్టీ నుంచి కొత్త నాయకుడే ప్రధాని అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ట్రూడో రాజీనామాతో కొత్త ప్రధానిని ఎంపిక చేయడానికి లిబరల్ పార్టీ లోపల వివిధ కసరత్తులు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి పదవి రేసులో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి.వీరిలో భారతీయ మూలాలు కలిగిన అనితా ఆనంద్ ప్రధాన పోటీదారుగా ఉన్నారు. 57 ఏళ్ల అనిత ప్రస్తుతం కెనడా రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వెళ్లి, నోవా స్కోటియాలో స్థిరపడ్డారు.

వివరాలు 

న్యాయవిద్యలో విద్యాభ్యాసం చేసిన అనిత 

అనిత పొలిటికల్ స్టడీస్, న్యాయవిద్యలో విద్యాభ్యాసం పూర్తి చేసి, టొరంటో యూనివర్సిటీలో బోధన చేశారు. ఆమె పేరు ప్రధాన మంత్రి పదవికి పరిగణనలో ఉంది. ఆమెతో పాటు భారతీయ మూలాలు కలిగిన ఎంపీలు జార్జ్ చాహల్, చంద్ర ఆర్య, ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, ఆర్థిక నిపుణుడు మార్క్ కార్నే కూడా ఈ రేసులో ఉన్నారు.