Loading...
Mark Carney : అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెన‌డా ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెన‌డా ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Mark Carney : అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెన‌డా ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాతో తాము యుద్ధంలో ఉన్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కెనడాపై జరిగిన ఆర్థిక దాడిగా అభివర్ణించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు చివరి నిమిషంలో విఫలమైన నేపథ్యంలో కార్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు

20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు..

అమెరికా విధించిన షరతులు కెనడా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా, తమ కీలక పరిశ్రమలను బలహీనపరిచేలా ఉన్నాయని మార్క్ కార్నీ స్పష్టం చేశారు.

అందుకే ఆ షరతులను అంగీకరించలేదని తెలిపారు. తమపై దాడి జరిగినప్పుడు యుద్ధంలో ఉన్నట్లుగానే భావించాలని, ఇప్పుడు కెనడాపై ఆర్థిక దాడి జరిగిందని అన్నారు.

అందువల్ల తాము కూడా యుద్ధంలో ఉన్నామని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ట్రంప్ నిర్ణయానికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై కెనడా కూడా సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.

కెనడాకు చెందిన సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది.

ఇది కెనడా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 5 శాతానికి సమానం.

వివరాలు

ట్రంప్ అసాధ్యమైన షరతులు..

అయితే అమెరికా తన సుంకాలను తగ్గిస్తే కెనడా కూడా సానుకూలంగా స్పందించేందుకు సిద్ధంగా ఉందని మార్క్ కార్నీ తెలిపారు.

అమెరికా నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం, స్టీల్, మోటార్ వాహనాలపై విధించిన సుంకాలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అలాగే అమెరికన్ ఆల్కహాల్ విక్రయాలను తిరిగి ప్రారంభించేలా తమ ప్రావిన్సులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

ట్రంప్ అసాధ్యమైన షరతులు విధించడం వల్లే వాణిజ్య ఒప్పందం నుంచి తాము వైదొలగాల్సి వచ్చిందని మార్క్ కార్నీ వివరించారు.

ADVERTISEMENT