Canada: కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ హతం
కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ అత్యంత కట్టుదిట్టమైన జైలులో మరో ఖైదీ దాడిలో మృతి చెందాడు. ఈ సంగతిని జైలు, అధికారులు శుక్రవారం (మే 31) తెలిపారు. 1990 , 2000వ దశకం మధ్యకాలంలో వాంకోవర్ నగరానికి సమీపంలో ఆరుగురు మహిళలను ఇతగాడు హతమార్చాడు. తన పందుల ఫామ్‌కి తీసుకెళ్లి హత్య చేశాడు . దీనికి గాను 2007లో దోషిగా నిర్ధారించి శిక్షను విధించారు.
కేసు పూర్వాపరాలిలా వున్నాయి
కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ లోని దిద్దు బాటు కేంద్రంలో పిక్టన్ ఖైదీగా ఉన్నాడు. అతనిపై మే 19న మరో ఖైదీ దాడి చేశాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ఆ సంస్ధ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పిక్టన్ ఎవరు ? పిక్టన్, 74, పశ్చిమ కెనడాకు పూర్వపు పందుల పెంపకందారుడు. దేశంలోని అత్యంత హీనమైన హంతకులలో ఒకడు. అతను ఆరు హత్యలకు దోషిగా నిర్ధారించినప్పటికీ, అంతకంటే ఎక్కువ మంది మహిళలను చంపినట్లు కోర్టు అనుమానించింది.
ఆరుగురు మహిళలను చంపినందుకు కఠినమైన శిక్ష
పిక్టన్ ది భయంకరమైన నేర చరిత్ర అతని నేర చరిత్ర 1990 ల చివరలో 2000 ల ప్రారంభంలో మొదలైంది. అతను 2002లో పట్టుబడ్డాడు. 2007లో ఆరుగురు మహిళలను చంపినందుకు కఠినమైన శిక్ష విధించారు. అయినా అతని పందుల షెడ్లో 33 మంది మహిళల మృతదేహాలు కనుగొన్నారు.ఆడవారిపై అత్యాచారం చేసి వారిని హతమార్చటం అతని స్వభావమని కోర్టు గుర్తించింది. దీంతో అతనికి 25 సంవత్సరాల పాటు పెరోల్ వచ్చే అవకాశం లేని విధంగా జీవిత ఖైదు విధించారు. అతని నేరాలు పాల్పడింది. ఎక్కువ మంది వేశ్యా వృత్తిలో వున్నవారే."ఈ కేసు బ్రిటీష్ కొలంబియా ,దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఈ మేరకు అని కెనడా దిద్దు బాటు ఏజెన్సీ తెలిపింది.