LOADING...
Pakistan car blast: పాకిస్థాన్ లో కారు బాంబు పేలుడు.. ఐదుగురు దుర్మరణం
పాకిస్థాన్ లో కారు బాంబు పేలుడు.. ఐదుగురు దుర్మరణం

Pakistan car blast: పాకిస్థాన్ లో కారు బాంబు పేలుడు.. ఐదుగురు దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు అనంతరం మంగళవారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌ సమీపంలో కారు పేలుడు సంభవించగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 నుండి 25 మంది వరకు గాయపడ్డారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ విస్ఫోటనం జరిగినట్లు సమాచారం. ఆ సమయానికి కోర్టు కాంప్లెక్స్ పరిసరాలు రద్దీగా ఉండటంతో అక్కడున్న న్యాయవాదులు, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. స్థానిక పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాకిస్థాన్ లో పేలుడు