LOADING...
Russia: కీవ్‌లో మారణహోమం.. రష్యా క్షిపణి దాడిలో 24 మంది దుర్మరణం
కీవ్‌లో మారణహోమం.. రష్యా క్షిపణి దాడిలో 24 మంది దుర్మరణం

Russia: కీవ్‌లో మారణహోమం.. రష్యా క్షిపణి దాడిలో 24 మంది దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్‌పై రష్యా జరిపిన క్రూయిజ్ క్షిపణి దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 11 వరకు కాల్పుల విరమణ పాటించిన రష్యా, ఆ తర్వాత మళ్లీ ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించినట్లు సమాచారం. తాజా దాడులతో కీవ్ నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా ప్రతిదాడులకు దిగింది.

వివరాలు

రియాజాన్ ప్రాంతంపై డ్రోన్ దాడులు

రష్యాలోని రియాజాన్ ప్రాంతంపై డ్రోన్ దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల కారణంగా అక్కడి చమురు శుద్ధి కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి మంటలు వ్యాపించాయి. ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా రష్యా 205 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేయగా, ఉక్రెయిన్ కూడా అదే సంఖ్యలో ఖైదీలను రష్యాకు అప్పగించింది.

Advertisement