LOADING...
Donald Trump: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన

Donald Trump: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
09:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఇది తాను ప్రపంచవ్యాప్తంగా ఆపిన 10వ యుద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఇరు దేశాల నాయకులు ఈ సీజ్‌ఫైర్‌కు అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. అలాగే వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్, లెబనాన్ నేతలు కలుసుకోవడం గత 34 ఏళ్లలో ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదేశించినట్లు కూడా ట్రంప్ వెల్లడించారు.

Advertisement