Loading...
Xi-Trump-Putin summit: చైనా, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్ష‍ిక సమావేశం
చైనా, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్ష‍ిక సమావేశం

Xi-Trump-Putin summit: చైనా, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్ష‍ిక సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా, రష్యా, అమెరికా దేశాల మధ్య కీలకమైన త్రైపాక్షిక సమావేశానికి రంగం సిద్ధమైంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపై సమావేశం కానున్నారు. ఈ నెల 19న దక్షిణ చైనాలోని షెన్‌జెన్ నగరంలో తొలిసారిగా ఈ మూడు దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ''ఈ నెల 19న షెన్‌జెన్‌లో చైనా, రష్యా, అమెరికా దేశాధినేతల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో జిన్‌పింగ్, పుతిన్, ట్రంప్ పాల్గొంటారు'' అని చైనా విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏయే అంశాలపై చర్చించనున్నారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

వివరాలు 

నవంబర్ 18, 19 తేదీల్లో భేటీ జరిగే అవకాశం 

ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) నేతల శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో నవంబర్ 18, 19 తేదీల్లో ఈ భేటీ జరిగే అవకాశముంది.

మరోవైపు ఈ త్రైపాక్షిక సమావేశం జరగనున్న విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్, అమెరికా వైట్‌హౌస్ కూడా ధ్రువీకరించాయి.

ఈ సమావేశంలో అణు నిరాయుధీకరణ, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ట్రంప్ చర్చించే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు.

అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న సైనిక చర్యల అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు లేవని వారు పేర్కొన్నారు.

ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ భద్రత పరంగా ఈ ముగ్గురు అగ్రనేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT