China: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించిన చైనా
మీథేన్ ఆధారిత క్యారియర్ రాకెట్‌ను అంతరిక్షంలోకి చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి దేశంగా చైనా అవతరించింది. చైనీస్ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ల్యాండ్‌స్పేస్‌కు చెందిన జుక్-2 క్యారియర్ రాకెట్‌ను చైనాలోని గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రయోగించినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. గతేడాది డిసెంబర్ 14న ఇదే మిషన్‌ను ల్యాండ్‌స్పేస్ సంస్థ నిర్వహించింది. కానీ తొలిసారి చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే రెండోసారి చేసిన ప్రయోగం మాత్రం విజయవంతమైనట్లు జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది.
ఈ ప్రయోగంతో చైనా అమెరికా, యూరప్‌పై చైనా పైచేయి
అంతరిక్షంలోకి మీథేన్‌తో నడిచే రాకెట్‌ను ప్రయోగించేందుకు చైనా అమెరికా, యూరప్, భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా తరఫున ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పెస్‌ఎక్స్ సంస్థ మీథేన్ రాకేట్‌పై సీరియస్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశాలను వెనక్కి నెట్టి, మీథేన్‌తో నడిచే రాకెట్‌ను ప్రయోగించిన తొట్టతొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. భూమి చుట్టూ కక్ష్యలోకి పేలోడ్‌లను మోసుకెళ్లగల తదుపరి తరం ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేసేందుకు చైనాకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడునుంది. అలాగే అంతరిక్ష రంగంలో భారత్, యూరప్ వంటి ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు సహాయపడుతుంది.