LOADING...
China: అమెరికా తరహాలో చైనా మెరైన్ కోర్ ఏర్పాటు
అమెరికా తరహాలో చైనా మెరైన్ కోర్ ఏర్పాటు

China: అమెరికా తరహాలో చైనా మెరైన్ కోర్ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మెరైన్‌ కార్ప్స్‌ (USMC)కు సమానంగా, చైనా కూడా తన సైనిక వ్యవస్థలో ప్రత్యేక మెరైన్‌ దళాన్ని రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా సైనిక చర్యలు చేపట్టే లక్ష్యంతో, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ మెరైన్‌ కోర్‌ పేరుతో సుమారు 30 వేల మంది సైనికులను సిద్ధం చేసినట్లు బీజింగ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సముద్ర-భూ బలగాల విభాగంలో ఆరు ఆర్మీ బ్రిగేడ్‌లు, రెండు యుక్తి బ్రిగేడ్‌లు, ఒక నావల్‌ షిప్‌బోర్న్‌ ఏవియేషన్‌ బ్రిగేడ్, అలాగే స్పెషల్‌ ఆపరేషన్స్‌ బ్రిగేడ్‌లు ఉన్నాయని తెలిపింది. ఈ ఏర్పాటుతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెరైన్‌ కోర్‌ కలిగిన దేశంగా చైనా అవతరించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికా కొనసాగుతోంది.

వివరాలు 

సంక్షోభ పరిస్థితుల్లో తక్షణ స్పందన ఇవ్వడానికి ఈ దళం 

ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ భవిష్యత్తు భద్రతను దృష్టిలో పెట్టుకొని నావికాదళంలో ఒక ప్రత్యేక విభాగంగా ఈ మెరైన్‌ కోర్‌ను ఏర్పాటు చేసినట్లు కమాండర్‌ వివరించారు. చైనా జాతీయ ప్రయోజనాలను కాపాడడం ప్రధాన లక్ష్యంగా, వేగవంతమైన సముద్ర విస్తరణకు, సంక్షోభ పరిస్థితుల్లో తక్షణ స్పందన ఇవ్వడానికి ఈ దళాన్ని రూపొందించినట్లు తెలిపారు. సముద్ర ప్రాంతాలు,విదేశీ భద్రతా పరిణామాలను నిరంతరం పర్యవేక్షించడం, వివిధ సైనిక కార్యకలాపాలను సమన్వయం చేయడం, భద్రతా ముప్పులు, సైనిక అవసరాలను అంచనా వేయడం, అలాగే అభివృద్ధి,పోరాట సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం వంటి కీలక అవసరాల కోసం ఈ మెరైన్‌ కోర్‌ను వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement