
China: హైట్ పెరగడానికి ఆపరేషన్ చేశారు.. కానీ నడవలేకపోయారు
ఈ వార్తాకథనం ఏంటి
ఎత్తు పెరగడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మగపిల్లలు కౌమారంలోకి ప్రవేశించేవరకూ మాత్రమే ఎత్తు పెరుగుతారు. అడపిల్లలు రజస్వల అయ్యాక పెరుగుదల మందగిస్తుంది.
అయితే చైనాలో హైట్ పెరగడానికి ఆపరేషన్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు వికలాంగులు అయ్యారు. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రావిన్స్ కు చెందిన జియాంగ్సు అనే మహిళ ఐదు అంగుళాలు పెరగడం కోసం ఆపరేషన్ చేయించుకుంది. దీని కోసం ఏకంగా రూ. 70 లక్షలు ఖర్చు చేసింది.
Details
అపరేషన్ తో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
అయితే అపరేషన్ తర్వాత ఎముకల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫలితంగా ఆమె పరిగెత్తడానికి, నడవడానికి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతోంది.
ఈ అపరేషన్ వల్ల తన జీవితం పూర్తిగా నాశనం అయిందని బాధితురాలు వాపోయింది.
ప్రావిన్స్‌కు చెందిన 29 ఏళ్ల వ్యక్తి చైనాలోని పబ్లిక్ హాస్పిటల్‌లో హైట్ కోసం 12 లక్షలు పెట్టి అపరేషన్ చేసుకున్నాడు.
దురదృష్టవశాత్తు ప్రస్తుతం అతను నడవడానికి ఇబ్బందులు పడుతున్నాడు.
ఇలాంటి శస్త్ర చికిత్సలు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.