NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఈ చైనా సింగర్ చాలా క్రేజీ.. న్యూఇయర్ కోసం కరోనా అంటించుకుందట..
    తదుపరి వార్తా కథనం
    ఈ చైనా సింగర్ చాలా క్రేజీ.. న్యూఇయర్ కోసం కరోనా అంటించుకుందట..
    కావాలని కరోనా బారిన పడిన చైనా సింగర్ జేన్ జాంగ్

    ఈ చైనా సింగర్ చాలా క్రేజీ.. న్యూఇయర్ కోసం కరోనా అంటించుకుందట..

    వ్రాసిన వారు Stalin
    Dec 22, 2022
    02:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కరోనా కేసులతో చైనా అల్లాడిపోతంది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓ చైనీస్ సింగర్ మాత్రం కరోనా పట్ల వింతగా ప్రవర్తించింది. అందరూ కరోనాకు దూరంగా ఉంటుంటే.. చైనాకు చెందిన ప్రముఖ గాయని, పాటల రచయిత జేన్ జాంగ్ మాత్రం కరోనాను కావాలనే అంటించుకుంది.

    అయితే ఈ విషయాన్ని స్వయంగా జేన్ జాంగ్ వెల్లడించడం గమనార్హం. దీంతో ఇదేం విడ్డూరమని అందరూ ముక్కున వెలేసుకుంటున్నారు. ఒకవైపు ప్రజలు BF.7 ఒమిక్రాన్ వేరియంట్‌తో అల్లాడిపోతుంటే.. ఇలా చేయడం ఏంటని ఆమెను ఎత్తిపొడుస్తున్నారు.

    జేన్ జాంగ్

    కారణం ఏం చెప్పిందంటే..?

    కరోనాను తాను ఎందుకు అంటించుకున్నానో సోషల్ మీడియా వేదికగా కారణం కూడా చెప్పింది జేన్ జాంగ్. నూతన సంవత్సర వేడుకల కచేరీకి సన్నద్దమ్యే ప్రక్రియలో భాగంగానే వైరస్‌ అంటుకునేలా చేసుకున్నానని, వేడుకలకు ముందు వైరస్ సోకి.. కోలుకోవడం వల్ల న్యూఇయర్ ఈవెంట్‌లో మళ్లీ కరోనా వచ్చే ప్రమాదం ఉండదని తాను భావించినట్లు చెప్పింది.

    నూతన సంవత్సర వేడుకల సమయంలో తన ఆరోగ్యం దెబ్బతింటే.. ప్రదర్శన చేయడం కష్టమవుతుందని అనుకున్నట్లు జేన్ జాంగ్ వివరించింది. అందుకే కరోనా వచ్చిన వారిని కలిసినట్లు పేర్కొంది. తద్వారా తనకు కరోనా సోకినట్లు చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025