Cuba: క్యూబాలో తీవ్ర ఇంధన సంక్షోభం.. దేశవ్యాప్తంగా బ్లాక్ అవుట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా విధించిన ఆంక్షల ప్రభావంతో క్యూబా తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. రాజధాని హవానా సహా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రభుత్వం బ్లాక్ అవుట్ ప్రకటించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ కోతలు అధికమవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. బుధవారం హవానాలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలుచోట్ల రహదారులను దిగ్బంధించి, టైర్లు దహనం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వివరాలు
సహజ వాయువును మాత్రమే ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం: విసెంటీ లివీ
హవానాలో రోజుకు 20 నుంచి 22 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు సమాచారం. దేశంలో నెలకొన్న పరిస్థితిపై క్యూబా ఇంధన మంత్రి విసెంటీ లివీ స్పందించారు. అమెరికా ఆంక్షల కారణంగానే ముడి చమురు, పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుతం కొంతమేర సహజ వాయువును మాత్రమే ఉత్పత్తి చేసుకోగలుగుతున్నామని వెల్లడించారు.