Mount Everest: 32వసారి ఎవరెస్ట్ అధిరోహణ.. కామి రితా షెర్పా సరికొత్త చరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పర్వతంపై నేపాల్‌కు చెందిన ఇద్దరు దిగ్గజ పర్వతారోహకులు మరోసారి చరిత్ర సృష్టించారు. కమీ రీటా షెర్పా, లక్పా షెర్పా 2026 ఎవరెస్ట్ ఎక్కే సీజన్‌లో తమ సొంత రికార్డులను తామే అధిగమిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిగా ఇప్పటికే ప్రపంచ రికార్డు సృష్టించిన కామి రితా షెర్పా.. ఈసారి 32వ సారి విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. దీంతో ఆయన తన సొంత ప్రపంచ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నారు.
వివరాలు
మరోసారి తన ప్రతిభతో సత్తా
ఇక లఖ్పా షెర్పా కూడా తన అద్భుతమైన పర్వతారోహణ ప్రతిభతో మరోసారి చరిత్రలో నిలిచారు. ఈ ఇద్దరి విజయాలు ప్రపంచవ్యాప్తంగా పర్వతారోహకులు, శాస్త్రవేత్తలు, పర్యాటక రంగ ప్రతినిధుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసాధారణ ధైర్యం, అనుభవం, శారీరక సామర్థ్యంతో ఎవరెస్ట్‌ను పదేపదే అధిరోహిస్తున్న ఈ షెర్పాలు నేపాల్‌కు గర్వకారణంగా నిలుస్తున్నారు.