LOADING...
Condor Airlines plane: గాల్లోనే పేలిన కాండోర్ ఎయిర్‌వేస్  విమానం ఇంజిన్.. ప్రయాణికులు సేఫ్
గాల్లోనే పేలిన కాండోర్ ఎయిర్‌వేస్  విమానం ఇంజిన్.. ప్రయాణికులు సేఫ్

Condor Airlines plane: గాల్లోనే పేలిన కాండోర్ ఎయిర్‌వేస్  విమానం ఇంజిన్.. ప్రయాణికులు సేఫ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రీస్‌ నుంచి జర్మనీకి బయలుదేరిన ఓ విమానం గాల్లోనే పెద్ద ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. సుమారు 1500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో,కాండోర్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ కుడివైపు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 273 మందికి పైగా ప్రయాణికులు ఉండటంతో,అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టెక్నికల్‌ లోపం కారణంగా ఇంజిన్‌లో పెద్ద శబ్దం రావడంతో మంటలు మరింతగా వ్యాపించాయి. ఇది ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.. ఈ ఘటన గ్రీస్‌లోని కోర్ఫు ద్వీపం సమీపంలో చోటుచేసుకుంది.

వివరాలు 

 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ 

విమానం గ్రీస్‌లోని కోర్ఫు ద్వీపం మీదుగా వెళ్తుండగా, కిందినున్న పర్యాటకులు, స్థానికులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆకాశంలో మంటలు చెలరేగిన విమానాన్ని చూసి అందరూ ఆందోళన చెందారు. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అత్యవసర ప్రోటోకాల్‌ను అమలు చేశారు. మంటలు ఆర్పేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించినా,మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితి సీరియస్‌గా మారుతున్నదని అర్థం చేసుకున్న పైలట్లు ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నారు. కోర్ఫుకు తిరిగి వెళ్ళకుండా,ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం ఎంచుకున్నారు. ఒక ఇంజిన్‌తోనే విమానాన్ని సుమారు 8,000 అడుగుల ఎత్తులో సురక్షితంగా బ్రిండిసి వైపు మళ్లించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు పైలట్లను అందరూ ప్రశంసించారు.

వివరాలు 

ప్రయాణికుల భద్రతే తమకు ప్రధాన లక్ష్యం 

బ్రిండిసి విమానాశ్రయం సిబ్బంది వెంటనే అలర్ట్‌ అయ్యి, ల్యాండింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. చివరికి విమానం సురక్షితంగా ల్యాండ్‌ కాగా, అక్కడికి చేరుకున్న అత్యవసర బృందం వెంటనే ప్రయాణికులను క్షేమంగా బయటకు దించారు. ఈ ఘటనలో ఎవరికి చిన్న గాయం కాలేదు. తరువాత కాండోర్‌ ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రయాణికుల భద్రతే తమకు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపి, మరుసటి రోజే అందరినీ జర్మనీకి పంపే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. ఈ సంఘటనలో సిబ్బంది చాకచక్యం, పైలట్ల ధైర్యం విమానాన్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన ఉదాహరణగా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాల్లోనే పేలిన విమానం ఇంజిన్