Ivanka Trump: ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర..? అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 23, 2026
09:38 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (Islamic Revolutionary Guard Corps)తో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్రకు పాల్పడినట్లు సమాచారం. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసెమ్ సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇవాంకా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని రూపొందించినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. అయితే తన ప్రణాళికను అమలు చేసే ముందే ఆ ఉగ్రవాది అరెస్టు అయినట్లు సమాచారం వెల్లడించింది.