LOADING...
National lottery: 24 ట్రిలియన్‌లో ఒక అవకాశం.. రెండోసారి £1 మిలియన్ గెలిచిన మిడ్-వేల్స్ దంపతులు
24 ట్రిలియన్‌లో ఒక అవకాశం.. రెండోసారి £1 మిలియన్ గెలిచిన మిడ్-వేల్స్ దంపతులు

National lottery: 24 ట్రిలియన్‌లో ఒక అవకాశం.. రెండోసారి £1 మిలియన్ గెలిచిన మిడ్-వేల్స్ దంపతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిడ్‌-వేల్స్‌కు చెందిన దంపతులు రెండోసారి జాతీయ లాటరీలో రూ.లక్షల (సుమారు £1 మిలియన్) జాక్‌పాట్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 24 ట్రిలియన్‌కు ఒకటి మాత్రమే ఉండే అవకాశాలను సవాల్ చేస్తూ, మళ్లీ అదే అదృష్టం వీరి వశమైంది. రిచర్డ్ డేవిస్ (49), ఫే స్టీవెన్సన్-డేవిస్ (43) దంపతులు తొలిసారిగా 2018 జూన్‌లో యూరో మిలియన్స్ 'మిలియనీర్ మేకర్' ద్వారా ఏడు అంకెల బహుమతిని గెలుచుకున్నారు. తాజాగా నవంబర్ 26న జరిగిన లాటో డ్రాలో ఐదు ప్రధాన నంబర్లు, బోనస్ బాల్ సరిపోలడంతో మరోసారి భారీ బహుమతి దక్కింది.

వివరాలు 

24 ట్రిలియన్‌కు ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం

ఈ సందర్భంగా ఫే మాట్లాడుతూ, "మళ్లీ ఇలా గెలవడం అసాధ్యమే అనిపించింది. కానీ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమేననడానికి మేమే ఉదాహరణ," అని బీబీసీకి తెలిపారు. జాతీయ లాటరీ నిర్వహణ సంస్థ ఆల్విన్ నిపుణుల ప్రకారం, ఒకే జంటఈ రెండు బహుమతులు గెలవడం 24 ట్రిలియన్‌కు ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం అని వెల్లడించారు. రిచర్డ్ మాట్లాడుతూ, "నాలుగు వరుస లాటో డ్రాల ద్వారా ఇది మా దగ్గరకు వచ్చింది. ఒక డ్రాలో రెండు నంబర్లు సరిపోతే, తదుపరి డ్రాకు లక్కీ డిప్ ఆటోమేటిక్‌గా వస్తుంది. అలా ఒక్కో డ్రా నుంచి మరొకదానికి వెళ్తూ చివరకు నవంబర్ 26న విజయం దక్కింది," అని వివరించారు.

వివరాలు 

సమాజ సేవకే ప్రాధాన్యం ఇస్తున్న దంపతులు 

భారీగా డబ్బు వచ్చినప్పటికీ, ఈ దంపతులు సమాజ సేవకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో హెయిర్‌డ్రెస్సర్‌గా పనిచేసిన రిచర్డ్ ప్రస్తుతం కార్డిఫ్‌లోని ఒక నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రంలో స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. అలాగే స్నేహితులకు సహాయం చేయడానికి డెలివరీ డ్రైవర్‌గా కూడా పనిచేస్తున్నారు. మాజీ నర్స్ అయిన ఫే, కార్మార్థెన్‌లోని 'సెగిన్ హెడ్డిన్' కమ్యూనిటీ కిచెన్‌లో చెఫ్ గా సేవలందిస్తున్నారు. అదేవిధంగా బ్రెకన్ అండ్ డిస్ట్రిక్ట్ మైండ్ వంటి స్థానిక సంస్థలకు మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు. క్రిస్మస్ రోజున కూడా ఆమె సేవలు కొనసాగిస్తారు.

Advertisement

వివరాలు 

రగ్బీ జట్టుకు విరాళంగా  మినీబస్ 

తొలిసారి గెలిచినప్పుడు తాము చేసిన సేవలను గుర్తు చేస్కుంటూ ఫే మాట్లాడుతూ, "అప్పుడు చాలామందికి కార్లు బహుమతిగా ఇచ్చాం. స్థానిక రగ్బీ జట్టుకు ఒక మినీబస్ విరాళంగా ఇచ్చాం. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సాధ్యమైనంత మందికి సహాయం చేశాం. ఇప్పుడు మళ్లీ ఏమి చేస్తామో తెలియదు. కానీ ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ, నిదానంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం," అని అన్నారు.

Advertisement