Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ కు అప్పగింత
ఈ వార్తాకథనం ఏంటి
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim)కు కీలక సహచరుడిగా భావిస్తున్న సలీం డోలా ను టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి భారత్‌కు డిపోర్ట్ చేశారు. భారత ఇంటెలిజెన్స్ సంస్థలు అంతర్జాతీయ ఏజెన్సీలతో సమన్వయం చేసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ANI వెల్లడించింది. ఏప్రిల్ 25న ఇస్తాంబుల్ పోలీస్ నార్కోటిక్స్ విభాగం బేలిక్‌డుజు ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి డోలా ను అరెస్ట్ చేసినట్లు CNN టర్కీ తెలిపింది. దీర్ఘకాల నిఘా తర్వాత అతని లొకేషన్‌ను గుర్తించినట్లు సమాచారం. డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ కూడా అతనిపై ఉంది.
వివరాలు
డోలాకి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
ఇదే సమయంలో ముంబై కుర్లా ప్రాంతంలో అరెస్టైన సహచరులు డోలా నుంచి ఆదేశాలు వచ్చాయని ఒప్పుకున్నట్లు సమాచారం. NDPS చట్టం 1985 కింద పలు కేసులు నమోదైన డోలా పై కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. భారత్‌కు తీసుకొచ్చిన అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీ టెక్నికల్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో 126 కిలోల మెఫెడ్రోన్, రూ.25.22 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతను కస్టడీలో ఉండగా ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక ముంబై పోలీసులు అతన్ని తమ కస్టడీకి తీసుకుని మరింత విచారణ, చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.