LOADING...
Hong Kong: హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 44కి చేరిన మృతుల సంఖ్య 
హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 44కి చేరిన మృతుల సంఖ్య

Hong Kong: హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 44కి చేరిన మృతుల సంఖ్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

హాంకాంగ్‌లో జరిగిన భయానక అగ్నిప్రమాదం కనీసం 44 మందిని బలితీసుకుంది. అదనంగా, దాదాపు 300 మందికి పైగా వ్యక్తులు ఎక్కడ ఉన్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉత్తర తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫుక్ కోర్ట్ అనే నివాస సముదాయంలో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పునరుద్ధరణ పనుల్లో ఉపయోగించిన ప్రమాదకరమైన పరంజా (scaffolding) నిర్మాణం, అలాగే ఫోమ్ వంటి సులభంగా మండే పదార్థాల వాడకమే మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమై ఉండొచ్చని పోలీసులు గురువారం ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు, నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌ను హత్య ఆరోపణలతో అరెస్టు చేశారని పోలీసు సూపరింటెండెంట్ ఐలీన్ చుంగ్ వెల్లడించారు.

వివరాలు 

నిర్లక్ష్యమే కారణమా? 

"ఈ నిర్మాణ సంస్థ బాధ్యత వహించాల్సిన వ్యక్తులు తీవ్రమైన నిర్లక్ష్యం చూపారని,అదే ఈ భారీ అగ్నిప్రమాదానికి నేరుగా దారితీసిందని భావించడానికి మా వద్ద పటిష్టమైన ఆధారాలు ఉన్నాయి. వారి నిర్లక్ష్యమే మంటలు అదుపు తప్పి పెను ప్రాణనష్టానికి కారణమైంది,"అని చుంగ్ రాయిటర్స్‌కు తెలిపారు. 32అంతస్తులు కలిగిన ఎనిమిది భవనాలు,మొత్తం 2,000యూనిట్లతో ఉన్న ఈ సముదాయంలో బుధవారం మధ్యాహ్నం మంటలు మొదలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా శ్రమించినప్పటికీ, భవనాల పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి అధిక ఉష్ణోగ్రతలు, గట్టి పొగ తీవ్ర అవరోధంగా మారాయి. 15 గంటల పైగా ప్రయత్నించిన తరువాత గురువారం ఉదయం నాలుగు బ్లాకుల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. మిగతా మూడు బ్లాకుల్లో మాత్రం ఆర్పే పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

వివరాలు 

అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు 

ఘటన స్థలం నుంచి బయటకు వచ్చిన వీడియోల్లో,32అంతస్తుల టవర్లలో కనీసం రెండింటి నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు,మరికొన్ని భవనాల నుంచి దట్టమైన నల్లపొగ వెల్లువెత్తుతున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,భవనాలను చుట్టి అమర్చిన రక్షణమెష్,ప్లాస్టిక్ పదార్థాలు అగ్నిమాపక ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. అలాగే, నిర్మాణ సంస్థ నిర్వహణ పనుల్లో భాగంగా ఒక ప్రభావితం కాని బ్లాక్ కిటికీలను ఫోమ్‌తో మూసివేసిందని గుర్తించారు. ఈ చర్య కూడా మంటలు భవనాల్లో వేగంగా వ్యాపించడానికి కారణమైందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం,రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హాంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదాల్లో అత్యధిక ప్రాణనష్టం కలిగించిన ఘటనగా నిలిచింది. అంతకుముందు,1996లో కౌలూన్‌లోని ఒక వాణిజ్యభవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 41మంది మృతి చెందారు.

Advertisement

వివరాలు 

ప్రజాగ్రహం, స్థానిక ప్రభావం 

హాంకాంగ్‌లో ఇప్పటికే ఉన్న ఆకాశాన్నంటుతున్న ఆస్తి ధరల కారణంగా ప్రజల్లో ఎన్నో ఏళ్లుగా అసంతృప్తి నెలకొని ఉంది. డిసెంబరు ప్రారంభంలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సంఘటన అధికారులపై మరింత విమర్శలను రేకెత్తించవచ్చని అంచనా. గురువారం ఉదయం రవాణా శాఖ తాయ్ పో పరిసరాల్లోని అనేక రహదారులను మూసివేసింది. 39 బస్సు రూట్లను మార్గం మార్చారు. ఈ అగ్నిప్రమాదం, దాని ప్రభావంతో ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయాల కారణంగా కనీసం ఆరు పాఠశాలలను మూసివేసినట్లు ఎడ్యుకేషన్ బ్యూరో ప్రకటించింది. గతంలో జరిగిన ప్రజా విచారణ అనంతరం హై-రైజ్ భవనాలకు సంబంధించి నిర్మాణ, అగ్నిమాపక నియమాలను విస్తృతంగా సవరించినప్పటికీ, ఈ దుర్ఘటన జరగడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement