LOADING...
Tigers death: థాయ్‌లాండ్‌ టైగర్ కింగ్‌డమ్‌లో ప్రాణాంతక వైరస్.. 72 పులులు మృత్యువాత
థాయ్‌లాండ్‌ టైగర్ కింగ్‌డమ్‌లో ప్రాణాంతక వైరస్.. 72 పులులు మృత్యువాత

Tigers death: థాయ్‌లాండ్‌ టైగర్ కింగ్‌డమ్‌లో ప్రాణాంతక వైరస్.. 72 పులులు మృత్యువాత

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్ లోని ప్రైవేటు టైగర్ కింగ్‌డమ్ పార్కులో ప్రాణాంతక వైరస్‌ కలకలం రేపింది. కొద్ది రోజుల వ్యవధిలోనే 72 పులులు మృత్యువాతపడ్డాయి. జంతు సంరక్షణ అధికారులు తనిఖీ చేసిన ఫలితాలు ప్రకారం, కెనైన్ డిస్టెంపర్ వైరస్‌ (CDV) కారణంగా పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఫుకెట్‌లోని ఈ పార్కుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ పులులతో అతి దగ్గరగా ఫొటోలు దిగే అవకాశం కల్పించడం వల్ల అది ప్రసిద్ధి చెందింది. అయితే ఫిబ్రవరి మొదటి వారంనుంచి పులులు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతోందని అధికారులు గుర్తించారు.

Details

భారీ సంఖ్యలో పులులు మృత్యువాత

వారి కళేబరాల నమూనాలను సేకరించి పరీక్షించిన ఫలితాల్లో శునక, పిల్లి జాతుల్లో కనిపించే CDV వైరస్‌ ఉందని నిర్ధారించారు. అంతేకాక బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో కలిపి అనారోగ్య కారణంగా భారీ సంఖ్యలో పులులు మరణిస్తున్నాయని గుర్తించారు. పులులు, శునక, పిల్లిలా కాకుండా, అనారోగ్యానికి గురైనప్పుడు కారణాలను గుర్తించడం కష్టమని అధికారులు తెలిపారు. అనారోగ్య లక్షణాలు కనిపించే సమయంలో చాల ఆలస్యమవుతుంది. ప్రస్తుతం, మిగతా పులులను సమీప జిల్లాలకు తరలించి క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు పార్క్ అధికారులు వెల్లడించారు.

Advertisement